అరసవల్లి ఆలయంలో అద్భుత దృశ్యం.. మూల విరాట్టును తాకిన సూర్యకిరణాలు
ఉత్తరాయణంలో అనగా మార్చ్ నెలలో 9,10 తేదీలలో ఇలాంజరుగుతుంది. అలాగే దక్షిణాయనంలో అక్టోబర్ 1,2 తేదీలలో స్వామి వారి మూల మూల విరాట్ నీ సూర్య కిరణాలు తాకటo ఆనవాయితీగా వస్తుంది. ఈ అద్భుత దృశ్యం చూసేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో భారీగా తరలి వస్తూ ఉంటారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.

ఆరోగ్య ప్రదాత, కనిపించే ప్రత్యక్ష దైవం శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో బుధవారం అద్భుత దృశ్యం ఆవిష్కృతం అయింది. ఉదయాన్న సూర్య కిరణాలు ఆలయంలోని ఆదిత్యుని మూలవిరాట్టును తాకాయి. ఉదయం 6 గంటల 10 నిమిషాలకు స్వామి వారి పాదాలను కిరణాలు స్పృశించాయి. సూర్యుని లేలేత కిరణాలు సుమారు కొన్ని సెకెన్లు పాటు మూల విరాట్టు పై ప్రకాసించాయి. కిరణ స్పర్శ సమయంలో సాలిగ్రామ ఏక శిలా విగ్రహమైన ఆదిత్యుని మూలవిరాట్టు బంగారు ఛాయలో కనువిందు చేసింది.
ఈ అపురూప దృశ్యo చూసిన భక్తులు పరవశించిపోయారు. నిజంగా ఇదో అద్భుతం. ఐదు ద్వారా బంధాలు, అలివేటి మండపం, ధ్వజస్తంభం, దాటుకొని ఆలయ ఆర్చ్ నుంచి సుమారు 300 అడుగులకు పై బడి దూరం ఉండే గర్భ గుడిలోని మూల విరాట్ ను సూర్య కిరణాలు తాకడాన్ని స్వామి వారి లీలగానే భక్తులు భావిస్తారు. ఈ ఘట్టం చూసేందుకు ముందుగానే ఆలయానికి భారీగా భక్తజనులు తరలి వచ్చారు. వాతావరణం అనుకూలంగా ఉంటే రేపు కూడా సూర్య కిరణాలు అరసవల్లిలో స్వామివారి మూల విరాట్టును తాకనున్నాయి. ప్రతియేట ఉత్తరాయణంలో,దక్షిణాయనంలో రెండేసి రోజులు మూలవిరాట్ ను సూర్యకిరణాలు తాకటం ఆనవాయితీ.
అరసవల్లి క్షేత్రంలో శ్రీ సూర్యనారాయణ స్వామి గర్భగుడిలోని స్వామి వారి మూలవిరాట్ ను ప్రతియేట సూర్యకిరణాలు రెండు రోజుల చెప్పున రెండు సార్లు స్పృశిస్తాయి. ఉత్తరాయణంలో అనగా మార్చ్ నెలలో 9,10 తేదీలలో ఇలాంజరుగుతుంది. అలాగే దక్షిణాయనంలో అక్టోబర్ 1,2 తేదీలలో స్వామి వారి మూల మూల విరాట్ నీ సూర్య కిరణాలు తాకటo ఆనవాయితీగా వస్తుంది. ఈ అద్భుత దృశ్యం చూసేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో భారీగా తరలి వస్తూ ఉంటారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..








