Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarimala Temple: శబరిమలకు పోటెత్తుతున్న భక్తులు.. కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సీఎం ఏమన్నారంటే..?

శబరిమలలో యాత్రికుల రద్దీతో అయ్యప్ప స్వామి దర్శనానికి సుమారు 20 గంటలకు పైగా సమయం పడుతోంది. దీంతో అయ్యప్ప భ‌క్తులలో ఆందోళ‌న‌ మొదలైంది..గడిచిన ఐదు రోజులుగా భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. రద్దీని అంచనా వేయడంలో, ఏర్పాట్ల విషయంలోనూ తప్పుగా నిర్వహించడంపై ప్రతిపక్షాలు కేరళ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.

Sabarimala Temple: శబరిమలకు పోటెత్తుతున్న భక్తులు.. కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సీఎం ఏమన్నారంటే..?
Sabarimala Temple
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 13, 2023 | 3:37 PM

శబరిమలలో యాత్రికుల రద్దీతో అయ్యప్ప స్వామి దర్శనానికి సుమారు 20 గంటలకు పైగా సమయం పడుతోంది. దీంతో అయ్యప్ప భ‌క్తులలో ఆందోళ‌న‌ మొదలైంది..గడిచిన ఐదు రోజులుగా భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. రద్దీని అంచనా వేయడంలో, ఏర్పాట్ల విషయంలోనూ తప్పుగా నిర్వహించడంపై ప్రతిపక్షాలు కేరళ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. తాజాగా తిరువనంతపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శబరిమలలో సరైన సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందని ఆరోపిస్తూ బీజేపీ ఆందోళనకు దిగింది. రోజుకు శబరిమలకు లక్ష మంది భక్తులు చేరుకుంటుండటం. సరైన సౌకర్యాలు కల్పించడం లేదని బీజేపీ ఆరోపిస్తుంది. కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయాయి. బీజేపీ శ్రేణులపై వాటర్ క్యానన్లతో అడ్డుకుంటున్నారు. స్వామి వారి దర్శనం కోసం వచ్చిన కొందరు భక్తులు అయ్యప్పను దర్శించుకోకుండానే వెనుదిరుగుతున్నారు. రద్దీకి తగిన ఏర్పాట్లు చేయలేదని బీజేపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో పోలీసులకు, బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరగగా బీజేపీ నేతలను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

కాగా.. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. ఆలయంలో రద్దీని నియంత్రించడానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటున్నారని దేవదాయ శాఖ మంత్రి కె.రాధాకృష్ణన్ తెలిపారు. నిర్దేశిత ప్రవేశ మార్గాలు కాకుండా వివిధ ప్రాంతాల గుండా భక్తులు కొండపైకి ఎక్కుతున్నారు. యాత్రికులను వెంబడించి పట్టుకోలేమ‌నీ, కానీ ఇప్పుడు పరిస్థితులు అదుపులోకి వచ్చాయన్నారు. ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దనీ, పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి సహకరించాలని ప్రభుత్వం ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేసింది.

కొట్టాయం – శబరిమల సన్నాహాలకు డబ్బు అడ్డంకి కాదని, యాత్రకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. అలాగే శబరిమల అభివృద్ధికి 220 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. రోజుకు 1.20 లక్షల మంది భక్తులు దర్శించుకుంటున్నారని ముఖ్యమంత్రి తెలిపారటు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న దృష్ట్యా.. దర్శన సమయాన్ని మరో గంట పెంచాలని అధికారులు నిర్ణయించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..