AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: నైరుతి దిశలో ఈ వస్తువులు పెడుతున్నారా.? చాలా డేంజర్‌..

ఇంటి వాస్తు విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నష్టాలు ఉంటాయని భావించే వారు మనలో చాలా మందే ఉంటారు. అందుకే ఇంటి నిర్మాణం మొదలు పెట్టకముందే వాస్తు పండితులతో వాస్తు సూచనలు తీసుకుంటారు. ఏ గది ఏ దిక్కులో ఉండాలని మొదలి, పిల్లర్స్‌ ఎక్కడ ఉండాలి, స్టెప్స్‌ ఎక్కడ ఉండాలి.?ఎన్ని డోర్స్‌ ఉండాలి.? ఎన్ని విండోస్‌ ఉండాలి.? ఇలా ప్రతీ చిన్న విషయంలోనూ

Vastu Tips: నైరుతి దిశలో ఈ వస్తువులు పెడుతున్నారా.? చాలా డేంజర్‌..
Vastu Tips
Narender Vaitla
|

Updated on: Sep 28, 2023 | 4:06 PM

Share

సొంతింటి నిర్మాణం ప్రతీ ఒక్కరి కల. అందుకే ఇంటి నిర్మాణం విషయంలో రాజీ పడకుండా చూసుకుంటారు. నిర్మాణానికి కావాల్సిన సామాగ్రి నాణ్యమైనదే కావాలని ఏరికోరి మరీ కొనుగోలు చేస్తారు. ఇక ఇంటి నిర్మాణానికి ఉపయోగించే వస్తువుల విషయంలో ఎంత స్పష్టతతో ఉంటారో, వాస్తు విషయంలోనూ అంతే క్లారిటీతో ఉంటారు. నిర్మాణశైలి ఎంత అద్భుతంగా ఉన్నా అది వస్తు ప్రకారం ఉందా లేదా అన్ని విషయాన్ని కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారు.

ఇంటి వాస్తు విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నష్టాలు ఉంటాయని భావించే వారు మనలో చాలా మందే ఉంటారు. అందుకే ఇంటి నిర్మాణం మొదలు పెట్టకముందే వాస్తు పండితులతో వాస్తు సూచనలు తీసుకుంటారు. ఏ గది ఏ దిక్కులో ఉండాలని మొదలి, పిల్లర్స్‌ ఎక్కడ ఉండాలి, స్టెప్స్‌ ఎక్కడ ఉండాలి.?ఎన్ని డోర్స్‌ ఉండాలి.? ఎన్ని విండోస్‌ ఉండాలి.? ఇలా ప్రతీ చిన్న విషయంలోనూ వాస్తు చిట్కాలను పాటిస్తుంటారు. అయితే ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా కొన్ని వాస్తు చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. అందులో ఒకటి ఇంట్లోని నైరుతి దిశ. ఈ దిశలో ఎలాంటి వస్తువులను పెట్టాలి.? ఎలాంటి వస్తువులను పెట్టకూడదు.? ఏ వస్తువులను పెడితే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది.? లాంటి విషయాలపై ఓ లుక్కేయండి..

* ఇంట్లో నైరుతి మూలన ఎట్టి పరిస్థితుల్లో మరుగుదొడ్డి ఉండకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలా ఉంటే ఇంట్లో వారికి కష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఇంట్లో అస్థిరత, గొడవలు, ఆర్థిక నష్టాలకు కారణంగా మారుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు.

* ఇక నైరుతి దిక్కులో ఎంత బరువు ఉంటే వాస్తు అంత మంచిగా ఉన్నట్లు. అందుకే నైరుతి దిశంలో బీరువా వంటి సామాగ్రాని పెట్టుకోవాలని సూచిస్తుంటారు. మరీ వీలైతే.. నైరుతి దిక్కువలో గ్యారేజీలు, పార్కింగ్‌, మెట్ల వంటి నిర్మాణాలు కూడా చేపట్టుకోవచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

* ఇంటి నైరుతి దిక్కుకు ఎలాంటి వీధి పోటు లేకుండా చూసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. దీనివల్ల ఇంట్లో వారికి అశుభ ఫలితాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇక నైరుతి దిశలో బావి కూడా లేకుండా చూసుకోండి. వర్షపు నీరు కూడా నిల్వకుండా చూసుకోవాలి.

* ఇక నైరుతి దిశలో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడని వాటిలో పూజా మందిరం ప్రధానమైంది. పొరపాటున కూడా ఈ దిశలో పూజ గదిని నిర్మించుకోకూడదు. నైరుతి దిశలో పూజలు నిర్వహిస్తే ప్రతిఫలం రాదు. దీంతో చేసిన పూజలన్నీ నిష్ఫలమవుతాయి.

* నైరుతి దిశలో స్థలం మొత్తం ఇంటిలోని అన్ని దిశలతో పోల్చితే కాస్త ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. నిర్మాణ శైలి ఇలా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే ఇంటి పెద్దకు సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది.

* ఇక ఇంటిలోకి ఎట్టి పరిస్థితుల్లో నైరుతి దిశ నుంచి వచ్చేలా ద్వారం ఉండకూడదు. దీనివల్ల ఇంట్లో ఆర్థిక కష్టాలు ఎదురవుతాయి. వీలైంత వరకు నైరుతి దిశలో ఆభరణాలు, విలువైన వస్తువులు ఉండేలా చూసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..