Vastu Tips: అద్దె ఇంటికి వాస్తు వర్తిస్తుందా.? రెంట్ తీసుకునే ముందు ఏ విషయాలు గుర్తుంచుకోవాలి..
అద్దె ఇంటికి వాస్తు వర్తిస్తుందా.? ఇంటి యజమానులపైనే వాస్తు ప్రభావం ఉంటుందని, ఇంట్లో అద్దెకు ఉండే వారికి వాస్తు వర్తించదనే భావనలో ఉంటారు. అయితే ఇందులో నిజం లేదని చెబుతున్నారు వాస్తు నిపుణులు. ఇంటి యజమానులకే కాకుండా ఇంట్లో అద్దెకు ఉండే వారిపై కూడా ఆ ఇంటి వాస్తు ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. ఇంటి వాస్తులో లోపం ఉంటే రెంట్‌కి ఉండే వారు కూడా ప్రతికూల పరిస్థితులు....

వాస్తును నమ్మేవారు మనలో చాలా మంది ఉంటారు. వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం ఉండాలని చూసుకుంటారు. ఇందుకోసం ఎంతో మంది వాస్తు పండితులను సంప్రదిస్తుంటారు. వారి సలహాలు, సూచనల ఆధారంగా ఇంటి నిర్మాణాన్ని చేపడుతుంటారు. పునాది నుంచి చివరికి రంగులు వేసుకునే వరకు ప్రతీ విషయంలో వాస్తును పాటిస్తుంటారు. అయితే ఒక్క విషయంలో మాత్రం చాలా మందికి ఎప్పుడు ఒక అనుమానం ఉంటుంది.
అదే.. అద్దె ఇంటికి వాస్తు వర్తిస్తుందా.? ఇంటి యజమానులపైనే వాస్తు ప్రభావం ఉంటుందని, ఇంట్లో అద్దెకు ఉండే వారికి వాస్తు వర్తించదనే భావనలో ఉంటారు. అయితే ఇందులో నిజం లేదని చెబుతున్నారు వాస్తు నిపుణులు. ఇంటి యజమానులకే కాకుండా ఇంట్లో అద్దెకు ఉండే వారిపై కూడా ఆ ఇంటి వాస్తు ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. ఇంటి వాస్తులో లోపం ఉంటే రెంట్‌కి ఉండే వారు కూడా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోక తప్పదని వాస్తు పండితులు చెబుతున్నారు. అద్దె ఇంట్లో ఉండే వారు పాటించాల్సిన కొన్ని వాస్తు నియమాలు ఇవే..
అద్దె ఇంట్లో ఉన్నా సరే ఆగ్నేయంలో వంటగది ఉండేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇక ఈశాన్యంలో ద్వారా, గృహం మధ్యన ఖాళీ ఉండాలని చెబుతున్నారు. నైరుతి దిశలో ఎట్టి పరిస్థితుల్లో బాల్కనీ ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇక అద్దె ఇంట్లో బెడ్ రూమ్ నైరు, దక్షిణం, పశ్చిమం వైపు ఉండేలా చూసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. నైరుతి దిశలో ఉన్న గదికి నైరుతి దిక్కు డోర్ ఉండకుండా చూసుకోవాలి. ఇక టాయిలెట్ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.. దక్షిణం, పశ్చిమం దిశలోనే టాయిలెట్స్ ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఇక వాస్తుతో సంబంధం లేకుండా అద్దె ఇంటిలో పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు మరికొన్ని ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి.. గతంలో ఆ ఇంట్లో ఏవైనా ఆత్మత్యలు లాంటివి జరిగాయా చెక్ చేసుకోవాలి. అద్దెకు ఉన్న వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారా.? ఏమైనా ప్రమాదాలు జరిగాయా.? సదరు పోర్షన్ తరచూ ఖాళీ అవుతోందా.? లాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..