Vastu tips: ఇంట్లో ఈ ఫొటోలు పెడుతున్నారా.? ఏమాత్రం మంచిది కాదంటోన్న నిపుణులు..

ఇక వాస్తు కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాకుండా, ఇంట్లో ఏర్పాటు చేసుకునే ప్రతీ వస్తువుపై కూడా ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు. బీరువా మొదలు ఫ్రిడ్జ్‌ వరకు అన్ని వస్తువులు వాస్తు ప్రకారం నిర్ధేశించిన ప్రదేశాల్లో ఉంచితే అంతా మంచి జరుగుతుందని విశ్వసిస్తుంటారు. ఇలాంటి వాటిలో ఒకటి ఫొటోలు. ఇంటి అలంకరణలో భాగంగా గోడలకు ఫొటోలు అతికిస్తుండం సర్వసాధారణ...

Vastu tips: ఇంట్లో ఈ ఫొటోలు పెడుతున్నారా.? ఏమాత్రం మంచిది కాదంటోన్న నిపుణులు..
Vastu Tips
Follow us

|

Updated on: Nov 17, 2023 | 9:43 PM

భారత్‌లో వాస్తును విశ్వసించే వారు చాలా మంది ఉంటారు. వాస్తు శాస్త్రాన్ని ఆధారం చేసుకొని ఇంటిని నిర్మించుకోవడం ఒక నమ్మకం వస్తోంది. అందుకే ఇంటి పునాది మొదలు, ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రతీ అంశంలో వాస్తు సరిగ్గా ఉండేలా చూసుకుంటారు. అందుకోసమే వాస్తు పండితుల సలహాలు తీసుకుంటారు.

ఇక వాస్తు కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాకుండా, ఇంట్లో ఏర్పాటు చేసుకునే ప్రతీ వస్తువుపై కూడా ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు. బీరువా మొదలు ఫ్రిడ్జ్‌ వరకు అన్ని వస్తువులు వాస్తు ప్రకారం నిర్ధేశించిన ప్రదేశాల్లో ఉంచితే అంతా మంచి జరుగుతుందని విశ్వసిస్తుంటారు. ఇలాంటి వాటిలో ఒకటి ఫొటోలు. ఇంటి అలంకరణలో భాగంగా గోడలకు ఫొటోలు అతికిస్తుండం సర్వసాధారణ విషయమే. అయితే కొన్ని ఫొటోలను ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో పెట్టుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ ఫొటోలు ఏంటంటే..

* ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా వస్తువు నీటిలో మునిగిపోతున్నట్లు ఉండే ఫొటోలను పెట్టుకోకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా సూర్యూడు అస్తమిస్తున్నట్లు ఉన్న ఫొటోలు ఇంట్లో పెట్టకోకూడదు. ఇది నెగిటివిటీకి సూచికగా చెబుతుంటారు. అలాగే పడవలాంటిది ఏదైనా నీటిలోకి మునిగిపోతున్నట్లున్న ఫొటోలు పెట్టుకుంటే అశుభ ఫలితాలు వస్తాయని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇలాంటి ఫొటోలు ఏర్పాటు చేసుకుంటే కుటుంబ సభ్యుల మధ్య వైరం ఏర్పడే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.

* ఇక ప్రకృతికి సంబంధించిన సీనరీలను ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం సర్వసాధారణమైన విషయం తెలిసిందే. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం.. జలపాలతాలకు సంబంధించిన ఫొటోలను ఇంట్లో ఉంచకూడదు. వీటివల్ల ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇంట్లో డబ్బు నీళ్లలా ఖర్చవుతుంది. అంతేకాకుండా దుబారా ఖర్చు పెరగడంతో పాటు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెరుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

* హింసాత్మక సంఘటనలకు సంబంధించిన ఫొటోలను ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేసుకోకూడదు. యుద్ధం వంటి ఘట్టాలకు సంబంధించిన ఫొటోలను ఇంట్లో పెట్టుకోవడం ద్వారా నెగిటివ్‌ ఎనర్జీ పెరుగుతుంది. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య నిత్యం కలహాలు పెరుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

ఇలాంటివి పెట్టుకోవాలి..

* ఇంట్లో చేపలు ఉండే (అక్వేరియం లాంటివి) ఫొటోలను ఏర్పాటు చేసుకుంటే మంచి జరుగుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను బయటపడొచ్చు. విజయాలు అందుతాయి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య సక్యత పెరుగుతుంది.

* సూర్యోదయం అవుతున్నట్లున్న ఫొటోలు పెట్టుకోవడం వల్ల కూడా మంచి జరుగుగుతుంది. మంచి పాజిటివ్‌ ఎనర్జీని ఇవ్వడంతో పాటు ఇంట్లో సానుకూలత పెరుగుతుంది.

* గొర్రెల ఫొటోలను పెట్టుకుంటే కూడా మంచి జరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈ ఫొటోల వల్ల అదృష్టంతో పాటు సంపద పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..