RED Movie Trailer : రామ్ ‘రెడ్’ ట్రైలర్ ఆగయా..’ఈసారి మంట మాములుగా లేదు’..మాస్, క్లాస్ మిక్స్
'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో ఊర మాస్ విజయం సొంతం చేసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని డ్యూయల్ రోల్ చేస్తోన్న తాజా చిత్రం 'రెడ్'. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నివేదా పేతురాజు, మాళవిక శర్మ, అమృత అయ్యర్ హీరోయిన్స్ గా నటించారు.

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఊర మాస్ విజయం సొంతం చేసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని డ్యూయల్ రోల్ చేస్తోన్న తాజా చిత్రం ‘రెడ్’. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నివేదా పేతురాజు, మాళవిక శర్మ, అమృత అయ్యర్ హీరోయిన్స్ గా నటించారు. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఓటీటీలో కాకుండా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని చాలా రోజులుగా ఎదురుచూస్తోంది. ఆ సమయం వచ్చేసింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించింది. తాజాగా ‘రెడ్’ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.
సస్పెన్స్ థ్రిల్లర్ మాదిరి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. రామ్ అభిమానులకు కావాల్సిన మాస్ అంశాలు కూడా పుష్కలంగా కనిపించాయి. మణిశర్మ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది. ఇచ్చి పడేశారు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘తడమ్’ చిత్రానికి రీమేక్‌గా ‘రెడ్’ తెరకెక్కుతోంది. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘రెడ్’ పై భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read :