Rapaka statement: జనసేన ఏకైక ఎమ్మెల్యే వెరైటీ కామెంట్స్

జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు మరోసారి పార్టీకి షాకిచ్చారు. పార్టీ అభిమతానికి భిన్నంగా వ్యవహరిస్తూ వస్తున్న రాపాక.. తానిక అదే దారిలో కొనసాగుతానని చెప్పకనే చెప్పేశారు. రాపాక గురువారం తిరుమలేశుని దర్శించుకున్నాక మీడియాతో మాట్లాడారు.

Rapaka statement: జనసేన ఏకైక ఎమ్మెల్యే వెరైటీ కామెంట్స్
Follow us

|

Updated on: Feb 27, 2020 | 4:01 PM

Janasena Party one and only MLA Rapaka vareity comments: జనసేన పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి వెరైటీ వ్యాఖ్యలతో వార్తలకెక్కారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. వెరైటీ కామెంట్లతో జనసేన వర్గాల్లో మరోసారి కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసిన వారంతా అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సహా అందరూ ఓటమి పాలు కాగా.. రాపాక వరప్రసాద్ ఒక్కరే తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలి అసెంబ్లీ సెషన్ నుంచి ఆయన అధికార వైసీపీకి అనుకూలంగా బీహేవ్ చేయడం మొదలు పెట్టారు. మొన్నీమధ్య మూడు రాజధానుల ప్రతిపాదనను జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే.. అదే పార్టీకి చెందిన రాపాక మాత్రం సమర్థించారు. ఏకంగా అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లుకు అనుకూలంగా ఓటు కూడా వేశారు.

Read this: చంద్రబాబు దారి జైలుకే… రోజా జ్యోతిష్యం నిజమేనా?

అయితే, ఉన్న ఒక్కనిపై చర్య తీసుకోవడమెందుకని అధినేత పవన్ కల్యాణ్ సైలెంట్‌గా వుండిపోతుంటే.. రాపాక మరోసారి మూడు రాజధానుల ప్రతిపాదనకు తాను అనుకూలమంటూ తిరుమలేశుని సన్నిధిలో మరోసారి ప్రకటించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీకి దూరమయ్యారా అని విలేకరులు అడిగితే.. ‘‘ దూరమూ కాలేదు.. అలాగని దగ్గరగా ఏమీ లేను’’ అంటూ వెరైటీ కామెంట్ చేసి.. చక్కా వెళ్ళిపోయారు రాపాక. ముఖ్యమంత్రి జగన్‌ను తరచూ కల్వడం.. పార్టీ అభిమతానికి భిన్నంగా.. ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడడం కొనసాగిస్తున్న రాపాక.. అదే తీరును ఇకముందు కంటిన్యూ చేసే పరిస్థితి కనిపిస్తోంది.

Read this: హైదరాబాద్‌లో శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలు బంద్!

కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.