Breaking News
  • కరోనా నుంచి బయటపడిన చైనా, ఇప్పుడు యూరప్‌ దేశాలకు కిట్లను, మాస్క్‌లను పంపిస్తోంది. అయితే వాటిలో నాణ్యత లేదని కొన్ని దేశాలు ఆరోపిస్తున్నాయి. పరికరాలను తిప్పి పంపిస్తున్నాయి. ఈ సంక్షోభాన్ని, చైనా తన ప్రభావాన్ని విస్తరించుకోవడానికి వాడుకుంటోందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా భూతం విస్తరిస్తోంది. ఏపీలో ఉన్న 13 జిల్లాలలో 11 జిల్లాలను కరోనా కమ్మేసింది. నిజాముద్దీన్‌ జమాత్‌ లింకులతో చిన్న పట్టణాలు, పల్లెలకు కూడా వ్యాపించింది కరోనా.. కొత్త కేసులన్నింటికీ ఢిల్లీ లింకులుండటం ఆందోళన కలిగిస్తోంది.
  • కరోనాపై యుద్ధం చేస్తున్న భారత్‌కు ప్రపంచబ్యాంకు భారీ సాయాన్ని అందించింది. భారత్‌తో పాటు కరోనాను ఎదుర్కొంటున్న పలు దేశాలకు ప్రపంచబ్యాంకు ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. కరోనాను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న భారత్‌కు ఒక బిలియన్‌ డాలర్ల భారీ ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది ప్రపంచబ్యాంక్‌..
  • ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆశా వర్కర్లు ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఇది గందరగోళానికి దారి తీస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్లారు ఆశావర్కర్లు. సర్వే కోసమని వెళ్లిన ఆశా వర్కర్లను దుర్భాషలాడటమే కాకుండా వారిపై దాడికి ప్రయత్నించారు
  • అమరావతి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఎస్మా పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు. 6 నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ జీవో కూడా విడుదల. ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ జీవో జారీ.

Roja comments: చంద్రబాబు దారి జైలుకే… రోజా జ్యోతిష్యం నిజమేనా?

టీడీపీ అధినేత చంద్రబాబు భవిష్యత్తుపై జోస్యం చెప్పారు సినీ నటి, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజా. శ్రీశైల మల్లన్న దర్శనం తర్వాత రోజా మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వ విధానాలను ఆకాశానికెత్తారు. బాబు జమానా అవినీతిమయమన్నారు.
roja astrology for chandrababu, Roja comments: చంద్రబాబు దారి జైలుకే… రోజా జ్యోతిష్యం నిజమేనా?

Roja says Chandrababu will go to jail soon: సినీ నటి, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా జ్యోతిష్యం చెప్పారు. ఆశ్చర్యంగా వున్నా.. ఇది నిజం. గురువారం నాడు శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్న తర్వాత ఉన్నట్లుండి జ్యోతిష్యం చెప్పడం మొదలు పెట్టారు. అది కూడా వారిది.. వీరిది కాదు ఏకంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భవిష్యత్తు గురించి రోజా జోస్యం చెప్పారు.

రోజా ఏం మాట్లాడినా సెన్సేషనే. అలాంటి గురువారం నాడు ఆమె జ్యోతిష్యం చెప్పడం మొదలు పెట్టేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. ఏకంగా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ భవిష్యత్తు గురించి ఆమె జోస్యం చెప్పారు. శ్రీశైల మల్లన్న దర్శనం తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. శ్రీశైల శివయ్య అందరినీ చల్లగా చూస్తారని, జగన్ సారథ్యంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోనున్నదని ఆమె చెప్పుకొచ్చారు.

అదే సమయంలో రోజా చంద్రబాబు జామానాపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు 5 సంవత్సరాల పాలనలో ఎప్పుడు ఏడుపేనని, రాష్ట్రంఅప్పుల్లో ఉందని, ఆయన దోచుకోవడానికి, దాచుకోవడానికి డోకా లేకుండా చూసుకున్నారని రోజా ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి 9 నెలల పాలనలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే విధంగా ముందుకు వెళ్తున్నారని అన్నారామె. దేశం మొత్తం రాష్ట్రంలోని పథకాల వైపు చూస్తున్నారని, వివిధ రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఏపీలో అమలు అవుతున్న పథకాలు.. అమ్మవడి, 3 రాజధానులు, దిశా యాక్ట్ గురించి తెలుసుకుంటున్నారని రోజా చెప్పుకొచ్చారు.

చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని 3 లక్షల కోట్ల రూపాయల మేరకు అప్పుల పాలు చేసారని, చేసిన తప్పులకు చంద్రబాబు, లోకేష్, ఆయన కేబినెట్‌లో పనిచేసిన వారంతా కచ్చితంగా త్వరలోనే జైలుకి వెళ్తారని రోజా జోస్యం చెప్పారు. తన మాజీ పర్సనల్ సెక్రెటరీ శ్రీనివాస్ రావు ఇంటి మీద, ఆయన ఆఫీసుల మీద ఐటీ దాడులు జరుగుతుంటే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని రోజా ప్రశ్నించారు.

Related Tags