AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాష్ట్రంలో ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తోందా?: బాబుపై షర్మిల ఫైర్

చంద్రబాబు పాలనలో ఏపీ 25ఏళ్లు వెనక్కి వెళ్లిందని, రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తోందా అంటూ మండిపడ్డారు జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల. త్రీడీలో రాజధానిని చూపించి ప్రజలను మోసం చేస్తున్నారని, రాజధానిలో ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేదు కానీ హైదరాబాద్‌లో మాత్రం చంద్రబాబు పర్మినెంట్ ఇల్లు కట్టుకున్నారని ఆమె అన్నారు. గత ఎన్నికల్లో 600హామీలు ఇచ్చిన చంద్రబాబు, అందులో ఒక్కటి కూడా నెరవేర్చలేదని పేర్కొన్నారు. బాబు వస్తే జాబ్ వస్తుందంటూ అప్పట్లో […]

రాష్ట్రంలో ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తోందా?: బాబుపై షర్మిల ఫైర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 25, 2019 | 12:33 PM

Share

చంద్రబాబు పాలనలో ఏపీ 25ఏళ్లు వెనక్కి వెళ్లిందని, రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తోందా అంటూ మండిపడ్డారు జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల. త్రీడీలో రాజధానిని చూపించి ప్రజలను మోసం చేస్తున్నారని, రాజధానిలో ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేదు కానీ హైదరాబాద్‌లో మాత్రం చంద్రబాబు పర్మినెంట్ ఇల్లు కట్టుకున్నారని ఆమె అన్నారు. గత ఎన్నికల్లో 600హామీలు ఇచ్చిన చంద్రబాబు, అందులో ఒక్కటి కూడా నెరవేర్చలేదని పేర్కొన్నారు.

బాబు వస్తే జాబ్ వస్తుందంటూ అప్పట్లో బాగా ప్రచారం చేశారని.. కానీ బాబు అధికారంలోకి వచ్చాక లోకేశ్‌కు తప్ప ఎవరకీ జాబ్ రాలేదని చెప్పారు. జయంతికి, వర్ధంతికి తేడా తెలియని లోకేశ్‌కు మూడు మంత్రిత్వ శాఖలను కట్టబెట్టారని విమర్శించారు. ప్రజల డేటా చోరీ చేశారని, డేటా చోరి చేసిన వారిపై చర్యలు ఏమైనా తీసుకున్నారా అంటూ షర్మిల ప్రశ్నించారు.

హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని చంద్రబాబు తీర్మానం చేశారని.. బాబు- మోదీ జోడీ కలిసి ప్రత్యేక హోదాను ఎగ్గొట్టారని షర్మిల దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో అవినీతి పెరిగిపోయిందని.. లంచగొండితనం, దౌర్జన్యాన్ని చంద్రబాబు ప్రోత్సహించారని ఆమె విమర్శించారు. ఇరిగేషన్ నుంచి ఇన్‌ఫ్రా వరకు అవినీతి పెరిగిపోయిందని షర్మిల అన్నారు. వెన్నుపోటులో చంద్రబాబుకు మంచి అనుభవం ఉందని, బాబును చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోందని చెప్పారు.

ఇక వైఎస్ఆర్ హయాంలో పేద కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేదని, రైతు ఆనందంగా ఉండేవాడని, అన్ని వర్గాలకు వైఎస్‌ఆర్ మేలు చేశారని ఆమె గుర్తు చేశారు. ఈ ఎన్నికలు ఏపీ ప్రజలకు కీలకం అని ఆమె పేర్కొన్నారు.

మా బాబాయిని దారుణంగా హత్య చేశారు తమ బాబాయి వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేశారని, పైగా మాపైనే ఆరోపణలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. వివేకా హత్యతో టీడీపీకి సంబంధం లేకపోతే.. థర్డ్ పార్టీతో విచారణకు ఎందుకు ఒప్పుకోవడం లేదో అర్థం కావడం లేదని ఆమె వ్యాఖ్యానించారు.

చంద్రబాబు డైరక్టర్.. పవన్ హీరో పవన్ కల్యాణ్ ఓ సినిమా హీరో అని.. రాజకీయ సినిమాలో ఆయనను చంద్రబాబు డైరక్ట్ చేస్తున్నారని విమర్శించారు. పవన్‌కు ఓటు వేస్తే టీడీపీకి ఓటు వేసినట్లేనని షర్మిల ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్‌..
ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్‌..
కన్న తండ్రే.. కాలయముడై.. కడుపున పుట్టారని కూడా చూడకుండా..
కన్న తండ్రే.. కాలయముడై.. కడుపున పుట్టారని కూడా చూడకుండా..
రాజయోగ గ్రహాల బలం.. కొత్త ఏడాది వారికి ప్రభుత్వ ఉద్యోగ యోగం..!
రాజయోగ గ్రహాల బలం.. కొత్త ఏడాది వారికి ప్రభుత్వ ఉద్యోగ యోగం..!
ఇలాంటి సైకోలు కూడా ఉంటారా? OTT టాప్ ట్రెండింగ్‌లోక్రైమ్ థ్రిల్లర్
ఇలాంటి సైకోలు కూడా ఉంటారా? OTT టాప్ ట్రెండింగ్‌లోక్రైమ్ థ్రిల్లర్
తలకు నూనె రాయడం మానేశారా..? అయితే, జరిగేది తెలిస్తే దెబ్బకు..
తలకు నూనె రాయడం మానేశారా..? అయితే, జరిగేది తెలిస్తే దెబ్బకు..
చంద్ర రాహువుల కలయిక.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం!
చంద్ర రాహువుల కలయిక.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం!
గోవిందరాజు స్వామి ఆలయంలో 50 కేజీల బంగారం మాయం చేశారు
గోవిందరాజు స్వామి ఆలయంలో 50 కేజీల బంగారం మాయం చేశారు
కేసీఆర్ బయటకు వచ్చి గర్జిస్తే దానికి సమాధానం చెప్పలేకపోయారు
కేసీఆర్ బయటకు వచ్చి గర్జిస్తే దానికి సమాధానం చెప్పలేకపోయారు
బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులకు నిరసనగా VHP ఆందోళన
బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులకు నిరసనగా VHP ఆందోళన
ఢిల్లీలో నకిలీ ఇన్సూరెన్స్ అధికారుల మోసాలు
ఢిల్లీలో నకిలీ ఇన్సూరెన్స్ అధికారుల మోసాలు