ఎన్నికల ప్రచారంలో పీవీపి జోరు
ఎన్నికల ప్రచారంలో పీవీపి జోరు చూపిస్తున్నారు. విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ జనంతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంట్ పరిధిలో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తున్న పీవీపి..ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లో పర్యటించిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదే..పదే బిజినెస్‌మాన్ అంటూ ప్రత్యర్థులు తనపై వేస్తున్న ముద్రను తీసివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. వ్యాపారాలు చేయకుండా…స్థానిక పార్లమెంట్ సభ్యుడు […]

ఎన్నికల ప్రచారంలో పీవీపి జోరు చూపిస్తున్నారు. విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ జనంతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంట్ పరిధిలో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తున్న పీవీపి..ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లో పర్యటించిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదే..పదే బిజినెస్‌మాన్ అంటూ ప్రత్యర్థులు తనపై వేస్తున్న ముద్రను తీసివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. వ్యాపారాలు చేయకుండా…స్థానిక పార్లమెంట్ సభ్యుడు ఇంత స్థాయికి వచ్చారా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు హెరిటేజ్ పాల వ్యాపారం లేదా అన్నారు. రౌడీయిజం చేసి..జనాలను బెదిరించేందుకు తాను రాజకీయాల్లోకి రాలేదని..ఆ బ్యాచ్ ఎవరో ప్రజలకు బాగా తెలుసన్నారు. అభివృద్ధే తన ప్రధాన ఎజెండా అన్న పీవీపి.. పలు ప్రఖ్యాతిగాంచిన కంపెనీలను విజయవాడకు తీసుకొచ్చి యువకుల ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యతనిస్తానని తెలిపారు. జగన్ వాడి, ఫ్యాన్ గాలి ఏంటో రానున్న ఎన్నికలే నిర్ణయిస్తాయని పీవీపి జోస్యం చెప్పారు. వ్యక్తిగత దూషణలు, అవినీతి ఆరోపణలకు ఏప్రిల్ 11న ప్రజలు బ్యాలెట్‌తో సమాధానం చెప్పనున్నారని అన్నారు.
