‘‘భర్తలను మార్చినంత ఈజీగా..’’ అంటూ స్మృతిపై అసభ్యకర వ్యాఖ్యలు
ఎన్నికల తేది సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకుల విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యర్థులపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడానికి సైతం వెనుకాడట్లేదు కొందరు రాజకీయ నాయకులు. తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై కాంగ్రెస్ మిత్రపక్షమైన పీఆర్‌పీ(పీపుల్స్ రిపబ్లికల్ పార్టీ) నాయకుడు జయదీప్ కవాడే నీచ వ్యాఖ్యలు చేశాడు. స్మృతి ఇరానీని ఉద్దేశిస్తూ మాట్లాడిన కవాడే.. ‘‘ఆమె తన నుదురుపై చాలా పెద్ద బొట్టును ధరిస్తారు. ఇలాంటి వారి గురించి కొందరు నాతో ఏం చెప్పారంటే.. భర్తల్ని […]

ఎన్నికల తేది సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకుల విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యర్థులపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడానికి సైతం వెనుకాడట్లేదు కొందరు రాజకీయ నాయకులు. తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై కాంగ్రెస్ మిత్రపక్షమైన పీఆర్‌పీ(పీపుల్స్ రిపబ్లికల్ పార్టీ) నాయకుడు జయదీప్ కవాడే నీచ వ్యాఖ్యలు చేశాడు.
స్మృతి ఇరానీని ఉద్దేశిస్తూ మాట్లాడిన కవాడే.. ‘‘ఆమె తన నుదురుపై చాలా పెద్ద బొట్టును ధరిస్తారు. ఇలాంటి వారి గురించి కొందరు నాతో ఏం చెప్పారంటే.. భర్తల్ని మారుస్తున్న కొద్దీ మహిళ పెట్టుకునే బిందీ సైజు కూడా పెరుగుతుందట. స్మృతి ఇరానీ పార్లమెంట్‌లో నితిన్ గడ్కరీ పక్కన కూర్చొని రాజ్యాంగాన్ని మార్చే విషయం గురించి చర్చిస్తుంది. కానీ ఆమె ఓ విషయం తెలుసుకోవాలి. మీరు భర్తలను మార్చినంత ఈజీగా మేము రాజ్యాంగాన్ని మార్చలేము’’ అంటూ వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఈ వ్యాఖ్యలపై పలువురు విమర్శలు చేస్తున్నారు. ఒక మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం అంటూ వారు అంటున్నారు.