‘హమ్‌ నిభాయేంగే’ పేరుతో కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల

ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలో హమ్‌ నిభాయేంగే పేరుతో కాంగ్రెస్‌ మేనిఫెస్టోను పార్టీ సీనియర్‌ నేతల సమక్షంలో విడుదల చేశారు.ఈ సందర్భంగా చిదంబరం మాట్లాడుతూ..లక్షలాది మంది ప్రజల అభిప్రాయాలు సేకరించి మేనిఫెస్టో రూపొందించామని తెలిపారు. ఇందులో అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు. మేనిఫెస్టోలో రైతులు, యువత, మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, విద్య, ఆరోగ్యం, పారిశ్రామిక రంగాలకు ప్రాధాన్యం కల్పించినట్లు వివరించారు. వీటితోపాటు దేశ భద్రత, విదేశీ […]

'హమ్‌ నిభాయేంగే' పేరుతో కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల
Follow us

| Edited By:

Updated on: Apr 02, 2019 | 1:35 PM

ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలో హమ్‌ నిభాయేంగే పేరుతో కాంగ్రెస్‌ మేనిఫెస్టోను పార్టీ సీనియర్‌ నేతల సమక్షంలో విడుదల చేశారు.ఈ సందర్భంగా చిదంబరం మాట్లాడుతూ..లక్షలాది మంది ప్రజల అభిప్రాయాలు సేకరించి మేనిఫెస్టో రూపొందించామని తెలిపారు. ఇందులో అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు. మేనిఫెస్టోలో రైతులు, యువత, మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, విద్య, ఆరోగ్యం, పారిశ్రామిక రంగాలకు ప్రాధాన్యం కల్పించినట్లు వివరించారు. వీటితోపాటు దేశ భద్రత, విదేశీ విధానం గురించి కూడా ప్రస్తావించినట్లు చెప్పారు. ఈ రోజు చారిత్రక రోజని.. కాంగ్రెస్‌ మేనిఫెస్టో భారత్‌ను బలమైన దేశంగా మార్చేందుకు సహాయపడుతుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా తెలిపారు.