దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న మూడో విడత లోక్‌సభ ఎన్నికలు

న్యూ ఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల సమరాంగణంలో మూడో విడత పోరు ప్రారంభమైంది. 13 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 116 లోక్‌సభ నియోజకవర్గాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతోంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తదితర ప్రముఖులు మూడో విడత బరిలో ఉన్నారు. గుజరాత్-26, కేరళ-20 లోని అన్ని లోక్‌సభ స్థానాలతోపాటు, అసోం- 4, బీహార్- 5, ఛత్తీస్‌గఢ్- 7, కర్ణాటక- 14, మహారాష్ట్ర- 14, ఒడిశా- 6, ఉత్తరప్రదేశ్- 10, […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:07 am, Tue, 23 April 19
దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న మూడో విడత లోక్‌సభ ఎన్నికలు

న్యూ ఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల సమరాంగణంలో మూడో విడత పోరు ప్రారంభమైంది. 13 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 116 లోక్‌సభ నియోజకవర్గాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతోంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తదితర ప్రముఖులు మూడో విడత బరిలో ఉన్నారు. గుజరాత్-26, కేరళ-20 లోని అన్ని లోక్‌సభ స్థానాలతోపాటు, అసోం- 4, బీహార్- 5, ఛత్తీస్‌గఢ్- 7, కర్ణాటక- 14, మహారాష్ట్ర- 14, ఒడిశా- 6, ఉత్తరప్రదేశ్- 10, పశ్చిమ బెంగాల్- 5, గోవా- 2, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ, త్రిపురలో ఒక్కో లోక్‌సభ సీటుకు ఈ విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి.