Kesineni Nani: రాజకీయాలకు టీడీపీ ఎంపీ కేశినేని గుడ్‌బై..! అధినేత చంద్రబాబుకు సమాచారం

బెజవాడ టీడీపీకి సైకిల్ రైడర్ కావలెను.. అవును మీరు విన్నది నిజమే.. ప్రస్తుతం ఎంపీగా ఉన్న కేశినేని నాని పార్టీ నుంచి మెల్లిమెల్లిగా సైడవుతున్నారు.

Kesineni Nani: రాజకీయాలకు టీడీపీ ఎంపీ కేశినేని గుడ్‌బై..! అధినేత చంద్రబాబుకు సమాచారం
Mp Kesineni Nani
Follow us

|

Updated on: Sep 24, 2021 | 9:14 PM

బెజవాడ టీడీపీకి సైకిల్ రైడర్ కావలెను.. అవును మీరు విన్నది నిజమే.. ప్రస్తుతం ఎంపీగా ఉన్న కేశినేని నాని పార్టీ నుంచి మెల్లిమెల్లిగా సైడవుతున్నారు. త్వరలోనే రాజకీయాలకు కూడా గుడ్‌బై చెప్పబోతున్నారు. ఇంతకీ ఆయన నిర్ణయం వెనుక మతలబేంటి? అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.  కేశినేని నాని.. విజయవాడ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన లీడర్‌. ట్రావెల్‌ బిజినెస్‌ నుంచి అంచెలంచెలుగా నాయకుడిగా ఎదిగాడు. టీడీపీ నుంచి రెండుసార్లు ఏంపీగా పోటీ చేసి గెలుపొందారు. రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా తాను మాత్రం ఎదురొడ్డి బెజవాడలో విజయదుందుబీ మోగించారు. ఆ తర్వాత నానితో పాటు ఆయన కూతురు కూడా పాలిటిక్స్‌లో యాక్టివ్‌ అయ్యారు.

రీసెంట్‌గా జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం శతవిధాలా ప్రయత్నించారు కేశినేని నాని. మరోవైపు సైకిల్‌ దిగి కమలం గూటికి చేరుతారనే టాక్‌ వినిపించింది. కానీ నాని మాత్రం నో కామెంట్‌ అంటూ దాటవేశారు. పార్టీ మార్పుపై ఎప్పుడు ఎక్కడా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే కొంతకాలంగా టీడీపీ ఆఫీస్‌కి దూరమయ్యారాయన. నిజానికి రాజకీయాలకు దూరంగా ఉండాలని గత ఎన్నికలకు ముందే నాని నిర్ణయం తీసుకున్నారు. అధినేత చంద్రబాబు సూచన మేరకు పోటీ చేసి రెండోసారి కూడా విక్టరీ కొట్టారు.

కొద్దిరోజులుగా పార్టీకి, నియోజకవర్గానికి దూరంగా ఉండడంతో కేశినేని టాపిక్‌ బెజవాడ సర్కిల్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయంపై నానిని సంప్రదించింది టీవీ9. సైకిల్ దిగననంటూనే రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. డబ్బు, పదవులపై ఎలాంటి ఆశలేదని.. వచ్చే నిధులతో తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానన్నారు. ఆయన కూతురు శ్వేత చౌదరి టాటా ట్రస్ట్‌లోకి వెళ్లిపోయింది. దీంతో తండ్రీబిడ్డలిద్దరూ నెక్ట్స్ ఎలక్షన్‌లో పోటీ చేయబోరని తేలిపోయింది.

పాలిటిక్స్‌కి దూరంగా ఉండడంపై ఇప్పటికే చంద్రబాబుకు సమాచారమిచ్చారు కేశినేని నాని. అలాగే వచ్చే ఎన్నికల్లో తన ప్లేస్‌లో వేరే అభ్యర్థిని కూడా చూసుకోవాలని చెప్పారట. ప్రస్తుతానికి నాని సిమ్లాలో ఉన్నారు. మరిప్పుడు ఆయన ప్లేస్‌లో బెజవాడలో సైకిల్‌పై సవారీ చేసేదెవరన్న చర్చ జోరుగా నడుస్తోంది.

Also Read: మళ్లీ కలిసిన పాత మిత్రులు.. ఆ రెండు చోట్ల ఎంపీపీ పదవులు టీడీపీకే.. జనసేన హెల్ప్

Viral Video: కన్నీళ్లు పెట్టించే వీడియో… బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు తల్లి ప్రాణత్యాగం