తెలంగాణ నూతన సెక్రటేరియట్‌కు రెడ్‌స్టోన్ నగిషీలు.. పార్లమెంటు, రాష్ట్రపతి భవన్ కట్టడాలను పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి..
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పార్లమెంట్ భవనం రెడ్ స్టోన్ ను పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సెక్రటేరియట్ భవనానికి పార్లమెంటు, రాష్ట్రపతి భవన్‌కు ఉపయోగించిన రెండ్ స్టోన్‌తో నగిషీలు దిద్దాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
ఈ మేరకు పార్లమెంట్, రాష్ట్రపతి భవన్‌కు వినియోగించిన రాళ్లను, నిర్మాణ డిజైన్లను పరిశీలించేందుకు శాసనసభ వ్యవహారాలు, రోడ్లు-భవనాలశాఖ మంత్రి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. శుక్రవారం హస్తినా పర్యటనలో మంత్రి బిజీబిజీగా గడిపారు. ఉదయం అధికారులతో ఆయన పార్లమెంట్, రాష్ట్రపతి భవన్‌లో సౌత్, నార్త్ బ్లాక్‌లో నిర్మాణాలను వీక్షించారు.
పార్లమెంట్ భవనం నిర్మాణంలో వినియోగించిన రెడ్‌స్టోన్ (ఎర్రరాతి) ని పరిశీలించారు. పార్లమెంట్ ఎదుట ఫౌంటెయిన్‌లను, రాష్ట్రపతి భవన్‌లో ఉన్న వివిధ రకాల రాతి నిర్మాణాలు, ఉపయోగించిన రాతి రకాలు, ఫౌంటెయిన్‌లు, అశోక హాల్‌ను తిలకించారు. మంత్రి వెంట ఆర్అండ్‌బీ ఈఎన్‌సీ గణపతి రెడ్డి, ఈఈ శశిధర్, ఆర్కిటెక్ట్ ఆస్కార్, షాపూర్ జీ సంస్థ ప్రతినిధి లక్ష్మణ్ పలువురు అధికారులు ఉన్నారు.
Read m
సైబరాబాద్ పోలీసుల సంచలన నిర్ణయం.. బైక్ వెనక కూర్చున్న వ్యక్తికి హెల్మెట్ లేకుంటే లైసెన్స్ రద్దు !