AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సైబరాబాద్‌ పోలీసుల సంచలన నిర్ణయం.. బైక్ వెనక కూర్చున్న వ్యక్తికి హెల్మెట్ లేకుంటే లైసెన్స్ రద్దు !

మీరు హెల్మెట్‌ లేకుండానే ప్రయాణిస్తున్నారా? ఏమవుతుందిలే.. చలానా కట్టేద్దాంలే అంటూ నిర్లక్ష్యంగా బైక్‌తో రోడ్డెక్కుతున్నారా? అయితే ఇది మీ కోసమే..

సైబరాబాద్‌ పోలీసుల సంచలన నిర్ణయం.. బైక్ వెనక కూర్చున్న వ్యక్తికి హెల్మెట్ లేకుంటే లైసెన్స్ రద్దు !
K Sammaiah
| Edited By: |

Updated on: Feb 19, 2021 | 3:39 PM

Share

Cyberabad Police: మీరు హెల్మెట్‌ లేకుండానే ప్రయాణిస్తున్నారా? ఏమవుతుందిలే.. చలానా కట్టేద్దాంలే అంటూ నిర్లక్ష్యంగా బైక్‌తో రోడ్డెక్కుతున్నారా? అయితే ఇది మీ కోసమే.. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు హైదరాబాద్‌ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారుల విషయంలో ఇక నుంచి కఠిన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించారు. ద్విచక్రవాహనదారులకు షాకిచ్చేలా సైబరాబాద్ ట్రాఫిక్‌ పోలీసులు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. హెల్మెట్ లేకుండా బండి నడిపితే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దుచేస్తామని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

ఇకపై హెల్మెట్ ధరించకుండా బైక్‌ నడపుతూ పట్టుబడితే రూ.100 చలానాతో సరిపెట్టబోమని, డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక షార్ట్ వీడియోను రిలీజ్ చేశారు. మోటారు వాహనాల సవరణ చట్టం 2019, సెక్షన్ 206 (4) ప్రకారం హెల్మెట్ లేకుండా బండి నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందని ట్రాఫిక్ పోలీసుల విభాగం స్పష్టం చేసింది.

హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ మొదటిసారి పట్టుబడితే మూడు నెలలు, రెండోసారి కూడా దొరికిపోతే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడానికి సంబంధిత ఆర్టీవో అధికారులకు సిఫారసు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. అంతేకాదు నాణ్యమైన హెల్మెట్లుధరించాలని.. బైక్ నడపుతున్న వ్యక్తితోపాటు వెనుక కూర్చున్న వ్యక్తి సైతం హెల్మెట్ ధరించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ప్రయాణానికి భరోసా కల్పించుకోవాలని, అలాగే రోడ్డు భద్రతలో తమతో సహకరించాని కోరారు. తద్వారా ప్రమాదాలను నివారించడంతోపాటు, చలానాల నుంచి తప్పించుకోవచ్చని పోలీసులు తెలిపారు

Read more:

పోలీసుల అదుపులో నాలుగో కీలక నిందితుడు.. అతడే కారు, కత్తులు సమకూర్చినట్టు అనుమానిస్తున్న పోలీసులు..

Follow Us
క్షమించు ఆయేషా.. కాసిన్ని కన్నీళ్లు తప్ప నీకు ఏం ఇవ్వలేకపోయాం..
క్షమించు ఆయేషా.. కాసిన్ని కన్నీళ్లు తప్ప నీకు ఏం ఇవ్వలేకపోయాం..
కొంప ముంచిన వరుడి అతి విశ్వాసం..!
కొంప ముంచిన వరుడి అతి విశ్వాసం..!
సెమీస్‌లో భారత్, పాకిస్థాన్ పోరు ఫిక్స్.. ట్విస్ట్ అదిరిపోలా..?
సెమీస్‌లో భారత్, పాకిస్థాన్ పోరు ఫిక్స్.. ట్విస్ట్ అదిరిపోలా..?
ఆహా ఏమి రుచి.. చుక్క నూనె లేకుండా టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై..
ఆహా ఏమి రుచి.. చుక్క నూనె లేకుండా టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై..
శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం.. ఫొటోలు వైరల్
శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం.. ఫొటోలు వైరల్
కోల్‌కతాలో భారీ భూకంపం.. ఇళ్లలోంచి బయటకు పరుగులు పెట్టిన జనాలు
కోల్‌కతాలో భారీ భూకంపం.. ఇళ్లలోంచి బయటకు పరుగులు పెట్టిన జనాలు
మీ తల రాతను మార్చే ఫొటోలు ఇవే.. ఇంట్లో ఉంటే లక్కే లక్కు!
మీ తల రాతను మార్చే ఫొటోలు ఇవే.. ఇంట్లో ఉంటే లక్కే లక్కు!
చెవి సమస్యలకు పతంజలి ఆయుర్వేధంతో అద్భుతచికిత్స..నో సైడ్ ఎఫెక్ట్స్
చెవి సమస్యలకు పతంజలి ఆయుర్వేధంతో అద్భుతచికిత్స..నో సైడ్ ఎఫెక్ట్స్
సర్దిచెప్పేందుకు వెళ్లి చావు కొని తెచ్చుకున్న యువకుడు..!
సర్దిచెప్పేందుకు వెళ్లి చావు కొని తెచ్చుకున్న యువకుడు..!
9 నంది అవార్డులు రాబట్టిన తెలుగు సంచలన చిత్రం ఏదంటే..?
9 నంది అవార్డులు రాబట్టిన తెలుగు సంచలన చిత్రం ఏదంటే..?