పోలీసుల అదుపులో నాలుగో కీలక నిందితుడు.. అతడే కారు, కత్తులు సమకూర్చినట్టు అనుమానిస్తున్న పోలీసులు..

తెలంగాణ హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు- నాగమణి హత్య కేసులో మరో కీలక నిందితుడు బిట్టు శ్రీనును..

పోలీసుల అదుపులో నాలుగో కీలక నిందితుడు.. అతడే కారు, కత్తులు సమకూర్చినట్టు అనుమానిస్తున్న పోలీసులు..
Follow us
K Sammaiah

|

Updated on: Feb 19, 2021 | 3:11 PM

తెలంగాణ హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు- నాగమణి హత్య కేసులో మరో కీలక నిందితుడు బిట్టు శ్రీనును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రహస్య ప్రదేశంలో అతడిని విచారిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కేసులో ఇప్పటికే కుంట శ్రీనివాస్‌ను-A1, చిరంజీవిని-A2, అక్కపాక కుమార్‌-A3 లను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

నాలుగో వ్యక్తి బిట్టు శ్రీను కూడా పట్టుబడటంతో నలుగురు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కాగా బిట్టు శ్రీను పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు మేనల్లుడు కావడం గమనార్హం. వామనరావు దంపతుల హత్యలో భాగంగా రిజిస్ట్రేషన్‌ కాని బ్రీజా కారు, హత్యకు ఉపయోగించిన కత్తులను బిట్టు శ్రీను ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్‌కు సమకూర్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

కుంట శ్రీను కారు డ్రైవర్‌ చిరంజీవితో కలిసి నడిరోడ్డుపైనే అడ్వకేట్‌ జంటపై హత్యాకాండకు తెగబడ్డాడు. ఇక సొంత గ్రామం గుంజపడుగులో మృతులతో నిందితులకు నెలకొన్న గొడవలే ఈ ఘటనకు కారణమని పోలీసులు వెల్లడించారు. కుంట శ్రీనివాస్‌ ఇంటి నిర్మాణాన్ని వామన్‌రావు అడ్డుకోవడం, అదే విధంగా ఊరిలో నిర్మిస్తున్న దేవాలయం పనులకు అభ్యంతరం తెలపడం, రామాలయ కమిటీ వివాదాల కారణంగా హత్యలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు.

Read more:

రెండోరోజు విధులు బహిష్కరించిన న్యాయవాదులు.. హైకోర్టు న్యాయవాద దంపతుల హత్యను ఖండిస్తూ ఆందోళనలు