వాలంటీర్లు తాడిపత్రిలో పనిచేస్తే శాంతిభద్రతల సమస్య, మరోసారి నామినేషన్లకు అవకాశం కోరిన జేసీ ప్రభాకర్ రెడ్డి
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వాలంటీర్లు తాడిపత్రిలో పని చేస్తే.. శాంతి భద్రతల సమస్య వచ్చే ప్రమాదం ఉందని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు...
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వాలంటీర్లు తాడిపత్రిలో పని చేస్తే.. శాంతి భద్రతల సమస్య వచ్చే ప్రమాదం ఉందని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గత ఏడాది జరిగిన పరిస్థితులను ఆయన వివరించారు. కనీసం నేను నామినేషన్ వేసే పరిస్థితి కూడా ఆరోజు లేదని.. తన లాయర్ ద్వారా నామినేషన్ వేశానని.. మాజీ ఛైర్ పర్సన్ నామినేషన్ పత్రాలను చించేశారని ఆరోపించారు. ఇందుకు సంంబధించిన వీడియో క్లిప్స్ ను ఆయన మీడియాకు చూపించారు.
ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆయన కుమారుడు సమక్షంలో దౌర్జన్యాలు, బెదిరింపులు జరిగాయని ఆరోపించారు. అందుకే మరోసారి నామినేషన్లకు అవకాశం ఇవ్వాలన్నారు. మరోవైపు రాత్రి 7గంటల తరువాత వచ్చిన పంచాయతీ ఎన్నికల రిజల్స్ట్ అన్నీ మ్యానిపులేట్ చేశారన్నారు. వాలంటీర్లు ప్రతి ఇంటికీ వెళ్లి డబ్బు పంచడమే కాకుండా.. పథకాలు రావని బెదిరిస్తున్నారని ప్రభాకర్ రెడ్డి అన్నారు.
Read also : Chalasani Srinivas Daughter : ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ కూతురు శిరీష్మ ఆత్మహత్య