Jithender Reddy: తప్పుడు ఆరోపణలతో ఈటల రాజేందర్‌ను బయటికి పంపించారు : జితేందర్ రెడ్డి

తప్పుడు ఆరోపణలతో ఈటల రాజేందర్ ను కెసిఆర్ బయటికి పంపించారని తెలంగాణ బీజేపీ నేత జితేందర్ రెడ్డి అన్నారు..

Jithender Reddy:  తప్పుడు ఆరోపణలతో ఈటల రాజేందర్‌ను బయటికి పంపించారు :  జితేందర్ రెడ్డి
Jithender Reddy
Follow us

|

Updated on: Jul 07, 2021 | 9:45 PM

Jithender Reddy : తప్పుడు ఆరోపణలతో ఈటల రాజేందర్ ను కెసిఆర్ బయటికి పంపించారని తెలంగాణ బీజేపీ నేత జితేందర్ రెడ్డి అన్నారు. కెసిఆర్ కి ఇష్టం అయినవాళ్ళు, జీహుజూర్ అనే వారిని మాత్రమే వెంబడి ఉంచుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమకారులు అందరినీ ఒక్కొక్కరిగా బయటికి పంపించారని చెప్పుకొచ్చిన జితేందర్ రెడ్డి, రాజీనామా చేసి ప్రజల మనిషి అన్పించుకుంటాను అని ఈటల మీ ముందుకు వచ్చారు.. ఈటల ఆత్మ గౌరవం నిలబెట్టే బాధ్యత  మా అందరిది..  అని ఇక్కడ ప్రజలందరూ అంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

“కెసిఆర్ గారు ఎన్నో బ్రమలు పెడుతున్నారు. దళితులకి ముఖ్యమంత్రి ఏటో పోయింది.. ఇప్పుడు ఇంటికి 10 లక్షలు ఇస్తా అంటున్నాడు. అయ్యా చింతమడక లో 10 లక్షల కోసం ఇంకా వేచిచూస్తున్నారు వారికి ఇవ్వండి ఫస్ట్. ఇళ్ళు కట్టిస్తా అని వారందరి ఇల్లు కూలగోట్టుకొని ఎదురుచూస్తున్నారు. వారి సంగతి చూడు మొదలు. చేపలు దుబాయ్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నామని చెప్తున్నారు.. ఎక్స్పోర్ట్ అయినట్టు ఆధారం చూపెట్టగాలరా? తెలంగాణా వచ్చిన తరువాత ఎవరి జీవితాలు బాగుపడ్డాయి. ఎవరు కోటీశ్వరులు అయ్యారు.” అంటూ జితేందర్ రెడ్డి ప్రశ్నించారు.

“16 వేల కోట్ల రూపాయల సర్ప్లస్ బడ్జెట్ తో తెలంగాణా ఇస్తే ఇప్పుడు 4 లక్షల 25 వేల కోట్ల రూపాయలు అప్పు చేశావు, సంవత్సరానికి 35 వేల కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నాం. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం గా చేశావు. అప్పు చేసి పప్పు కూడు పెడుతున్నావు. ప్రజలను మభ్యపెడుతున్నావు. కాళేశ్వరం కమీషన్లు కుమ్ముకుంటున్నావు. కేంద్రం ఇస్తున్న డబ్బులతో పబ్బం గడుపుతున్నావు. నీ అబద్దాలను ప్రజలునమ్మరు. నీ నాయకులను ప్రజలు నిలదీస్తున్నారు. వాటన్నిటికీ కెసిఆర్ సమాధానం చెప్పాలి.” అంటూ జితేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. హుజూరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశం తరువాత శక్తి కేంద్రాల బాధ్యుల సమావేశంలో జితేందర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సమావేశంలో హుజురాబాద్ బిజెపి అభ్యర్ధి ఈటల రాజేందర్ తోపాటు, హుజురాబాద్ ఎన్నికల BJP ఇంచార్జ్ జితేందర్ రెడ్డి, A చంద్రశేఖర్, ఏనుగు రవీందర్ రెడ్డి, ధర్మరావు, వన్నాల శ్రీరాములు, రేవూరి ప్రకాష్, కృష్ణా రెడ్డి, nvss ప్రభాకర్, కూన శ్రీశైలం, చాడ సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read also: Nara Lokesh : కోన‌సీమ రైతులు క్రాప్‌హాలీడే ప్రక‌ట‌న‌లు వెన‌క్కి తీసుకునేలా ప్రభుత్వం చ‌ర్యలు తీసుకోవాలి : నారా లోకేష్

మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.