Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీపీఎంతోనే ప్రజల అజెండా అమలు.. విజయవాడను అభివృద్ధి చేసిన ఘనత సీపీఎం వామపక్ష పార్టీలదే -సీహెచ్‌ బాబూరావు

తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల పాలనలో విజయవాడ కార్పొరేషన్ ఉన్నప్పటికీ ఇంటిపన్ను, చెత్తపన్ను, నీటి పన్నులు పెంచేందుకు వారు చేసిన ప్రయత్నాలను సమర్థవంతంగా..

సీపీఎంతోనే ప్రజల అజెండా అమలు.. విజయవాడను అభివృద్ధి చేసిన ఘనత సీపీఎం వామపక్ష పార్టీలదే -సీహెచ్‌ బాబూరావు
Follow us
K Sammaiah

|

Updated on: Mar 03, 2021 | 4:53 PM

ప్రజా అజెండా అమలు కావాలంటే సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు అన్నారు. ప్రెస్ క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయం, స్వపరిపాలన, సుపరిపాలన లక్ష్యంగా సీపీఎం కార్పొరేటర్ అభ్యర్థులు పనిచేస్తారని ఆయన స్పష్టం చేశారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బాబూరావు మాట్లాడుతూ పది సంవత్సరాల వామపక్ష పాలనలో ప్రజలపై ఎలాంటి పన్నుల భారం మోపకుండా విజయవాడను అభివృద్ధి చేసిన ఘనత సీపీఎం వామపక్ష పార్టీలదేనన్నారు.

తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల పాలనలో విజయవాడ కార్పొరేషన్ ఉన్నప్పటికీ ఇంటిపన్ను, చెత్తపన్ను, నీటి పన్నులు పెంచేందుకు వారు చేసిన ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పికొట్టామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటీకరణ విధానాలను గత తెలుగుదేశం, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాలు నిలువరించలేని దుస్థిలో ఉన్నాయని విమర్శించారు. అందులో భాగంగానే ఆస్తి విలువ అధారిత పన్ను పెంపునకు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం సిద్దమై ఆదేశాలు జారీ చేసిందన్నారు. వచ్చే ఏప్రిల్ ఒకటవ తేదీనుంచి ప్రభుత్వ జీవోలు 196,197,198 ప్రకారం ఆస్తి, నీరు, చెత్త పన్నులు 10 నుండి 20 శాతం పెంచడం ద్వారా ప్రజలపై మోయలేని భారం పడుతుందన్నారు.

వైసీపీ, తెలుగుదేశం అభ్యర్థులను గెలిపిస్తే వారు ఆయా పార్టీలకు ప్రతినిధులు అవుతారే తప్ప ప్రజా ప్రతినిధులు కారని, అదే సీపీఎం అభ్యర్థులను గెలిపిస్తే ప్రజల తరపున ప్రజాప్రతినిధులుగా పనిచేస్తారని ఆయన స్పష్టం చేశారు. గత కార్పొరేషన్ లో ఒక్క సీపీఎం కార్పొరేటర్ మినహా మిగిలిన వాళ్లందరూ నగరంలోని భవన యజమానుల నుండి డబ్బులు ( కార్పొరేటర్ టాక్స్) ఏ విధంగా వసూలు చేశారనేది ప్రజలు ఆలోచన చేయాలన్నారు. సీపీఎం పార్టీ అభ్యర్ధులను గెలిపించడం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని బాబూరావు తెలిపారు.

రాజకీయ, సాంస్కృతిక, వాణిజ్యా లకు పేరు, ప్రఖ్యాతులున్న విజయవాడ నగరం పాలకుల చేతుల్లో నిర్లక్ష్యానికి గురౌతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న నగరానికి ఇప్పటివరకు బైపాస్ రోడ్డు లేకపోవడం సిగ్గుచేటన్నారు. రెండేళ్ల లో పూర్తి కావాల్సిన కనకదుర్గ ఫ్లై ఓవర్ ఐదేళ్లకు పూర్తి చేసి అది తమ క్రెడిట్ గా చేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడ్డాయని ఎద్దేవాచేశారు. గుణదాల ఫ్లై ఓవర్ కు శంకుస్థాపన చేసి దశాబ్దకాలం, కార్పొరేషన్ కార్యాలయ నిర్మాణం ప్రారంభించి ఐదేళ్లు పూర్తి అయినా పనుల్లో పురోగతి లేదన్నారు. స్టాం వాటర్ డ్రైన్ కు నిధులు ఉన్నా పూర్తి కాలేదని,మెట్రోరైలు ప్రాజెక్టును కూడా నీరుగార్చారని, ఇటువంటి పరిస్థితుల్లో విజయవాడ ఎప్పుడు అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు.

నగర పాలక సంస్థ ప్రతిష్ట,గౌరవాన్ని గత,ఇప్పటి ప్రభుత్వాలు భ్రష్టు పట్టించాయని దుయ్యబట్టారు. వ్యక్తిగత చర్యలు,దూషణలు కే ఆయా పార్టీలు ప్రాధాన్యత ఇస్తూ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశాయని విమర్శించారు.సరళీకృత ఆర్థిక విధానాలతో ఓటు అంగడిలో సరకుగా మారిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ధైర్యం ఉంటే ఆ రెండు పార్టీలు డబ్బు,ప్రలోభాలకు తావివ్వకుండా ఎన్నికల్లో పోటీ చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలపై పన్నులు భారం మోపేందుకు సూత్రధారి అయిన బీజేపీ కి ఓటు అడిగే హక్కు లేదన్నారు. పార్టీలతో పొత్తు లేకుండా ప్రజా పొత్తుతోనే 22 డివిజన్లలో పోటీ చేస్తున్నామన్నారు. నిజమైన ప్రజా ప్రతినిధులుగా పనిచేసామని, ఇకముందు పనిచేస్తామని,ప్రజలు విజ్ఞతతో ఓటు వేసి తమ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ అధ్యక్షులు చావా రవి, కార్యదర్శి కొండా రాజేశ్వరరావు ‌తదితరులు పాల్గొన్నారు.

Read More:

నాగార్జున సాగర్‌లో కాగుతున్న కాషాయం.. బండి సంజయ్‌కి సవాల్‌గా మారిన అభ్యర్థి ఎంపిక

చావుకు దగ్గరగా వెళ్లి వచ్చిన అస్సాం ప్రొఫెసర్..!
చావుకు దగ్గరగా వెళ్లి వచ్చిన అస్సాం ప్రొఫెసర్..!
మొక్కే కదా అనుకోకండి..! 150కి పైగా రోగాలను ఖతం చేసే బ్రహ్మాస్త్రం
మొక్కే కదా అనుకోకండి..! 150కి పైగా రోగాలను ఖతం చేసే బ్రహ్మాస్త్రం
ప్రేమ కోసం సినిమాలు వదిలేసిన హీరోయిన్.. చివరకు భర్త చేతిలో..
ప్రేమ కోసం సినిమాలు వదిలేసిన హీరోయిన్.. చివరకు భర్త చేతిలో..
అన్నం తిన్న వెంటనే టీ తాగుతున్నారా.? శరీరంలో ఏం జరుగుతుందంటే..
అన్నం తిన్న వెంటనే టీ తాగుతున్నారా.? శరీరంలో ఏం జరుగుతుందంటే..
'స్థానికుల సహకారంతోనే ఉగ్ర దాడి.. అందుకే హిందువులు టార్గెట్‌'
'స్థానికుల సహకారంతోనే ఉగ్ర దాడి.. అందుకే హిందువులు టార్గెట్‌'
బ్లాక్ బెర్రీస్ తింటే ఏమవుతుందో తెలుసా..? డయాబెటీస్‌ ఉన్న వారికి
బ్లాక్ బెర్రీస్ తింటే ఏమవుతుందో తెలుసా..? డయాబెటీస్‌ ఉన్న వారికి
ఉగ్రదాడిలో మరణించిన హీరోయిన్ తండ్రి.. కిడ్నాప్ చేసి ఏడు రోజులు ..
ఉగ్రదాడిలో మరణించిన హీరోయిన్ తండ్రి.. కిడ్నాప్ చేసి ఏడు రోజులు ..
Viral Video: పెళ్లి వేడుకలో వధూవరులు తుపాకీతో సంబరాలా?...
Viral Video: పెళ్లి వేడుకలో వధూవరులు తుపాకీతో సంబరాలా?...
కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయడంలో ముక్కురాజు మాస్టర్ నంబర్ వన్‌
కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయడంలో ముక్కురాజు మాస్టర్ నంబర్ వన్‌
నరమేధానికి మినీ స్విట్జర్లాండ్‌‌ ఎందుకు?
నరమేధానికి మినీ స్విట్జర్లాండ్‌‌ ఎందుకు?