AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AIMIM: ఎంఐఎం పార్టీ బిగ్ షాక్..! నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీ గూటికి జంప్..!

హైదరాబాద్‌కు చెందిన ఎంఐఎం గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి బీహార్‌లో పాగా వేసింది. రాష్ట్రంలో ముస్లిం ఓట్లను గణనీయంగా తన ఖాతాలో వేసుకున్నది. ఐదు స్థానాలు గెలుపొందిన ఆ పార్టీ ఆర్జేడీని ప్రతిపక్షానికి పరిమితమయ్యేలా చేసింది. ఇప్పుడు ఆ పార్టీలో..

AIMIM: ఎంఐఎం పార్టీ బిగ్ షాక్..! నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీ గూటికి జంప్..!
Asaduddin Owaisi
Sanjay Kasula
|

Updated on: Jun 08, 2022 | 3:55 PM

Share

దేశమంతా విస్తరించాలని కలలు కంటున్న మజ్లిస్‌ అధినేత అసుదుద్దీన్‌ ఒవైసీకి(Asaduddin Owaisi) గట్టి షాక్‌ తగిలింది . బీహార్‌లో మజ్లిస్‌ పార్టీకి(AIMIM) చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీ గూటికి చేరుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఎంఐఎం గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి బీహార్‌లో పాగా వేసింది. రాష్ట్రంలో ముస్లిం ఓట్లను గణనీయంగా తన ఖాతాలో వేసుకున్నది. ఐదు స్థానాలు గెలుపొందిన ఆ పార్టీ ఆర్జేడీని ప్రతిపక్షానికి పరిమితమయ్యేలా చేసింది. ఇప్పుడు ఆ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. తర్వాలోనే ఎంఐఎంకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీలో విలీనం కానున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నది. ఇదే జరిగితే రాష్ట్రంలో ఆ పార్టీ ఉనికి కోల్పోయే అవకాశం ఉన్నది.

కాగా, ఈ వార్తలను ఎంఐఎం నాయకుడు అక్తరుల్‌ ఇమామ్‌ కొట్టిపారేశారు. 2020 ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి తమ పార్టీ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవాలని పెద్ద పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ప్రలోభాలకు మా ఎమ్మెల్యేలు ఎట్టిపరిస్థితిలో తలొగ్గరని చెప్పారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయని, త్వరలోనే నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది

2021 ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు తమ భవిష్యత్‌ గురించి తీవ్ర ఆందోళనలో ఉన్నారని రాజకీయ వర్గాలు వెల్లడించాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం 100 స్థానాల్లో పోటీచేసినప్పటికీ.. ఒక్క చోటా గెలుపొందకపోవడం, ముస్లిం కూడా ఆ పార్టీకి ఓట్లు వేయలేదని, దీంతో వచ్చే ఎన్నికల్లో తమ పరిస్థితి ఏంటనే ఆలోచనలో పడ్డారని తెలిపాయి.

2025 అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ ఓటర్లు తమను చిత్తు చేస్తారని బీహార్ AIMIM చట్టసభ సభ్యులు భయపడుతున్నారు. అందుకే RJDలో చేరాలని యోచిస్తున్నారు. AIMIM ఎమ్మెల్యేలు అధికార పార్టీలో విలీనమైతే ప్రస్తుతం 76 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీహార్‌లో RJD అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది.

ఈ నలుగురి చేరికతో బీహార్‌ అసెంబ్లీలో ఆర్జేడీ బలం 76కు చేరనుంది. ప్రస్తుతం అధికార బీజేపీ కూటమికి 77 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా, 2020లో జరిగిన ఎన్నికల్లో 20 స్థానాల్లో ఆర్జేడీ విజయావకాశాలను ఎంఐఎం ప్రభావితం చేసిన విషయం తెలిసిందే.