కాకపుట్టిస్తోన్న నాగార్జునసాగర్ బై ఎలక్షన్ ప్రచారం.. భానుడి భగ భగలను లెక్కచేయకుండా దూసుకుపోతున్న అభ్యర్థులు
తిరుమలలో రిటైర్డ్ అర్చకుల రిక్రూట్‌మెంట్.. కంట్రావర్సీకి కేరాఫ్‌గా మారింది. మూడేళ్ల క్రితం రిటైర్ అయిన అర్చకులు తిరిగి విధుల్లో చేరొచ్చంటూ టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది.
Nagarjuna Sagar bypoll: మండుటెండల్లో కూడా మాటలతో మంటపుట్టిస్తున్నారు సాగర్ ఉప ఎన్నికల్లో అభ్యర్థులు. భానుడి భగ భగలను లెక్కచేయని పార్టీలు జోరుగా ప్రజల్లోకి దూసుకు పోతున్నాయి. ఏడేళ్లుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలే మళ్లీ గెలిపిస్తాయని టీఆర్‌ఎస్ అంటే.. హామీలను పూర్తిగా నెరవేర్చలేదంటూ విపక్షాలు ఎదురుదాడికి దిగుతున్నాయి.
నాగార్జునసాగర్ బై ఎలక్షన్ ప్రచారం కాకపుట్టిస్తోంది. ఈ ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంత.. ఆయా పార్టీల అభ్యర్థులంతా మండుతున్న ఎండలను సైతం లెక్కచేయడం లేదు. ప్రజాక్షేత్రంలో చెమటోడ్చుతున్నారు. అధికార పక్షం అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తుండగా.. విపక్షాలు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చలేదంటూ ఎదురుదాడికి దిగుతున్నాయి.
ఇలా నాగార్జున సాగర్ ఉపఎన్నిక ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. పలు ప్రాంతాల్లో జరిగిన ప్రచారంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్, జగదీష్‌లు టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్‌తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని.. ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌కు పట్టంకట్టి ప్రభుత్వానికి మద్దతివ్వాలని కోరారు.
మాడుగులపల్లి మండలం గజలపురంలో టీఆర్‌ఎస్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. అటు ఏడేళ్లలో సాగర్ నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఆరోపించారు. కాకతీయ కమ్మ సేవాసమితి భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జానారెడ్డితోపాటు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. సాగర్‌ను పర్యాటకంగా ఎంత అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న జానారెడ్డికి పోటీనే ఉండకూడదన్న ఉత్తమ్.. ఉపఎన్నికలో కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
నిడమనూరు మండలం మండలంలోని పల్లెల్లో బీజేపీ అభ్యర్థి రవి కుమార్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని రవికుమార్ విమర్శించారు. ప్రతీ గడపగడపకు వెళ్లి కమలం గుర్తుకే ఓటేయాలని వేడుకున్నారు.
Also Read: ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. అదే సమయంలో ఓపెన్ హార్ట్ సర్జరీ.. డాక్టర్లు ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు
పులి మాదిరిగా పిల్లి వేట.. దాని స్కిల్ చూస్తే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి