తిరుమల నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారం

తిరుమల: ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు శనివారం తిరుపతి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ముందుగా కుటుంబ సభ్యలతో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం తిరుపతికి చేరుకుని తారకరామ స్టేడియంలో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు.ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటారు. అక్కడ జిల్లా నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ఆదివారం విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నాయకులు, కార్యకర్తల సమావేశాలకు హాజరవుతారు. […]

  • Ram Naramaneni
  • Publish Date - 8:54 am, Sat, 16 March 19
తిరుమల నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారం

తిరుమల: ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు శనివారం తిరుపతి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ముందుగా కుటుంబ సభ్యలతో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం తిరుపతికి చేరుకుని తారకరామ స్టేడియంలో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు.ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటారు. అక్కడ జిల్లా నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ఆదివారం విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నాయకులు, కార్యకర్తల సమావేశాలకు హాజరవుతారు. సోమవారం కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ, మంగళవారం అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లోనూ సీఎం పర్యటించనున్నారు