జైలు నుంచి విడుదలైన అచ్చెన్నాయుడు కంటనీరు.. ఆ విషయం నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్
శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ గ్రామంలో సర్పంచ్ పదవి కోసం పోటీ చేసిన అప్పన్న ను ఫొన్ లో బెదిరించిన కేసులో 14 రోజులు రిమాండ్ పై జైలుకి వెల్లిన..
శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ గ్రామంలో సర్పంచ్ పదవి కోసం పోటీ చేసిన అప్పన్న ను ఫొన్ లో బెదిరించిన కేసులో 14 రోజులు రిమాండ్ పై జైలుకి వెల్లిన అచ్చెన్నాయుడు బెయిల్ పై విడుదల అయ్యారు. జైల్ నుంచి బైటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ భావోగ్వేదానికి గురయ్యారు. తనను కలిసేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలను చూసి కంట తడి పెట్టారు.
సంబంధం లేని కేసులో నన్ను ఇరికించి జైలుకు పంపారని, ఇది కక్ష సాధింపు చర్య అన్నారు అచ్చెన్నాయుడు. ముఖ్యమంత్రికి గుదిబండగా ఉన్న కింజారపు కుటుంబాన్ని భూస్ధాపితం చేయాలన్న దురుద్దేశంతోనే తనను ఇలా తప్పుడు కేసులో ఇరికించారని ఆరోపించారు. పోలీసు వ్యవస్థను చూస్తే సిగ్గు పడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఆ ఉద్యోగానికి అనర్హుడని, నేను బెదిరించానో లేదో… ఆడియో మరోసారి పరిశీలించాలని సూచించారు.
నాపై ఇంత దారుణంగా వ్యవహరించినా అనుభవమున్న తమ్మినేని, ధర్మాన సోదరులు ఎందుకు మౌనం వహించారో అని వారి వైఖరిపై తీవ్రంగా మండి పడ్డారు. వారి అనుభవం ఏమయ్యిందని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటుతో సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. పులిని బోనులో బంధించి పంచాయతీలను ఏకగ్రీవం చేసుకోవాలన్న ప్రయత్నాన్ని కార్యకర్తలు తిప్పి కొట్టడంలోనే టీడీపీ పార్టీ బలమేంటో మరోసారి రుజువు అయిందన్నారు.
విశాఖ ఉక్కు పై పార్టీలకు అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణ ఆలోచన నన్ను బాధించిందన్నారు. తాను మాట్లాడిన ఫోన్ ఆడియోలో ఒక్క చోటైనా బెదిరింపు ఉంటే… రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ చేశారు అచ్చెన్నాయుడు. సింహాన్ని బంధించి ఏకగ్రీవాలు చేసుకోవాలని చూశారని, అయినా వాళ్ల కుట్రలు సాగలేదని వ్యాఖ్యానించారు అచ్చెన్న.
కాగా.. అచ్చెన్నాయుడికి టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. అక్రమ కేసులతో బీసీ నేతలను వేధిస్తున్న ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే అచ్చెన్నాయుడుపై.. జగన్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని విమర్శించారు. ప్రజా క్షేత్రంలో పోరాడే నేతలే చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.
Read more:
సీఎం కేసీఆర్ సభకు సర్వం సిద్ధం.. ధన్యవాద సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జగదీష్‌రెడ్డి