రఫేల్ వ్యాఖ్యలపై రాహుల్‌కు మరో అవకాశమిచ్చిన సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు ఇటీవల రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై గత ఏడాది ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఈ నెల 10న ఉత్తర్వులిచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రధానమంత్రిని చౌకీదార్ చోర్ అని స్పష్టం చేస్తోందంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినట్టు వార్తలొచ్చాయి. దీనిపై బీజేపీ నేత మీనాక్షి లేఖీ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయగా, విచారించిన సుప్రీంకోర్టు దానిపై వివరణ ఇవ్వాలని రాహుల్‌ను ఆదేశించింది. దీనిపై ఏప్రిల్ 22న రాహుల్ […]

రఫేల్ వ్యాఖ్యలపై రాహుల్‌కు మరో అవకాశమిచ్చిన సుప్రీంకోర్టు
Follow us

| Edited By:

Updated on: Apr 30, 2019 | 7:14 PM

సుప్రీంకోర్టు ఇటీవల రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై గత ఏడాది ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఈ నెల 10న ఉత్తర్వులిచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రధానమంత్రిని చౌకీదార్ చోర్ అని స్పష్టం చేస్తోందంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినట్టు వార్తలొచ్చాయి. దీనిపై బీజేపీ నేత మీనాక్షి లేఖీ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయగా, విచారించిన సుప్రీంకోర్టు దానిపై వివరణ ఇవ్వాలని రాహుల్‌ను ఆదేశించింది.

దీనిపై ఏప్రిల్ 22న రాహుల్ అఫిడవిట్ దాఖలు చేశారు. తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే విచారం అనే మాటను బ్రాకెట్‌లో ఉంచారంటూ మీనాక్షి మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీనిపై తాను క్షమాపణలు చెబుతానని రాహుల్ తెలిపారు. ఈ విషయాన్ని నేడు సుప్రీంకోర్టుకు రాహుల్ తరుపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వెల్లడించారు. దీంతో క్షమాపణలతో కూడిన అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు కోర్టు రాహుల్‌కు మరో అవకాశం కల్పించింది.