రంజుగా మారిన హుజూర్‌నగర్ ఉప ఎన్నిక..సీపీఐ మద్దతు కోరిన టీఆర్‌ఎస్

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. తెలంగాణ పీసీసీ ఛీప్ ఉత్తమ్ కోటరీని బద్దలుకొట్టాలని టీఆర్‌ఎస్ చూస్తోంది. అందుకోసం రాజకీయాల్లో అపర చాణక్యుడైన సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. సామ, ధాన, భేద, దండోపాయాలలో ఏది ఉపయోగించైనా..పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని సీఎం భావిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేసిన టీఆర్ఎస్.. హుజూర్ నగర్‌లో మాత్రం కలిసొచ్చే పార్టీలను కలుపుకుపోవాలని వ్యూహం రచిస్తోంది. ముఖ్యంగా  హుజూర్‌నగర్‌లో ప్రభావితం […]

రంజుగా మారిన హుజూర్‌నగర్ ఉప ఎన్నిక..సీపీఐ మద్దతు కోరిన టీఆర్‌ఎస్
Follow us

|

Updated on: Sep 29, 2019 | 4:19 PM

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. తెలంగాణ పీసీసీ ఛీప్ ఉత్తమ్ కోటరీని బద్దలుకొట్టాలని టీఆర్‌ఎస్ చూస్తోంది. అందుకోసం రాజకీయాల్లో అపర చాణక్యుడైన సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. సామ, ధాన, భేద, దండోపాయాలలో ఏది ఉపయోగించైనా..పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని సీఎం భావిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేసిన టీఆర్ఎస్.. హుజూర్ నగర్‌లో మాత్రం కలిసొచ్చే పార్టీలను కలుపుకుపోవాలని వ్యూహం రచిస్తోంది. ముఖ్యంగా  హుజూర్‌నగర్‌లో ప్రభావితం చూపగల కమ్యూనిస్టు పార్టీలతో పొత్తుకు ఉవ్వీళ్లూరుతుంది. ఇప్పటికే సీపీఐ మద్దతు కోరింది. అందులో భాగంగా ఎన్నడూలేని విధంగా కేసీఆర్ సీపీఐ శరణు జొచ్చారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ తరుపున పార్టీ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ సభ్యుడు కేశవరావు, ఎంపీ నామా నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మఖ్దూం భవన్‌‌లో సీపీఐ నేతలతో చర్చలు జరుపారు.

అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో..మహాకూటమి పేరిట ఏర్పాటైన పలు విపక్షాలతో సీపీఐ కూడా చేతులు కలిపిన సంగతి విధితమే. అయితే ప్రస్తుతం హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతుందా? లేదా అన్న విషయం ఆసక్తి కరంగా మారింది. యురేనియం ఆపాలని, పోడు భూముల విషయంలో తమ డిమాండ్లను సీపీఐ నేతలు..టీఆర్‌ఎస్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ అంశాలపై టీఆర్‌‌ఎస్ కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలిపింది. పొత్తు విషయంపై అక్టోబర్ 1వ తేదీన కార్యవర్గ సమావేశంలో చర్చించి తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని సీపీఐ నేతలు తెలిపారు.

ఇదిలా ఉంటే,టీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఇప్పటికే హుజూర్ నగర్‌లో దిగి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీ అధికార అభ్యర్థి సైదిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి గత ఓటమికి బదులు తీర్చుకోవాలని భావిస్తున్నారు. మరోవైపు ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన టీడీపీ..తమ అభ్యర్థిగా చామ కిరణ్మయిని కన్ఫార్మ్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.