దేశ కోసం సర్వం త్యాగం చేస్తా..

సార్వత్రికి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ యూపీలోని రాయ్ బరేలీ స్థానం నుంచి మరోసారి గెలిచారు. మొత్తం 81 స్థానాలు ఉన్న యూపీలో కేవలం ఒకే ఒక సీటును మాత్రమే కాంగ్రెస్ దక్కించుకుంది. అయితే ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి సోనియా గాంధీ లేఖ రాశారు. భారతదేశ విలువలను కాపాడేందుకు ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని.. తనను మరోసారి ఎన్నుకున్నందుకు రాయ్‌బరేలీ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని […]

దేశ కోసం సర్వం త్యాగం చేస్తా..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 27, 2019 | 4:55 PM

సార్వత్రికి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ యూపీలోని రాయ్ బరేలీ స్థానం నుంచి మరోసారి గెలిచారు. మొత్తం 81 స్థానాలు ఉన్న యూపీలో కేవలం ఒకే ఒక సీటును మాత్రమే కాంగ్రెస్ దక్కించుకుంది. అయితే ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి సోనియా గాంధీ లేఖ రాశారు.

భారతదేశ విలువలను కాపాడేందుకు ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని.. తనను మరోసారి ఎన్నుకున్నందుకు రాయ్‌బరేలీ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని లేఖలో వెల్లడించారు. దేశపు విలువలను కాపాడతానని మీకు ప్రమాణం చేస్తున్నానని.. అవసరమైతే నాకు మిగిలిందంతా త్యాగం చేయడంలో వెనకడుగు వేయనని.. రానున్న రోజులు కష్టంగా ఉండబోతున్నాయన్న సంగతి నాకు తెలుసని అన్నారు. కానీ మీరు నా వెనుక ఉన్నారన్న బలం, నాపై మీ నమ్మకం.. నన్ను నడిపిస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు.