AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ ఆప్ ‘ కి అల్కా గుడ్ బై ! ఎందుకు ?

ఢిల్లీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీకి ‘ ప్రత్యేక ఆకర్షణ ‘ గా నిలిచిన ఎమ్మెల్యే అల్కా లాంబా ఇక పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్ ఘోర పరాజయానికి పార్టీ చీఫ్ కేజ్రీవాల్ జవాబుదారీ వహించాలని ఆమె డిమాండ్ చేశారు. దీంతో ఈమెను పార్టీ అధికారిక వాట్సాప్ గ్రూపు నుంచి నేతలు తొలగించారు. (ఢిల్లీలోని ఏడు లోక్ సభ నియోజకవర్గాల్లో ఎందులోనూ ఆప్ విజయం సాధించలేకపోయింది..) […]

' ఆప్ ' కి అల్కా గుడ్ బై ! ఎందుకు ?
Pardhasaradhi Peri
|

Updated on: May 26, 2019 | 5:24 PM

Share

ఢిల్లీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీకి ‘ ప్రత్యేక ఆకర్షణ ‘ గా నిలిచిన ఎమ్మెల్యే అల్కా లాంబా ఇక పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్ ఘోర పరాజయానికి పార్టీ చీఫ్ కేజ్రీవాల్ జవాబుదారీ వహించాలని ఆమె డిమాండ్ చేశారు. దీంతో ఈమెను పార్టీ అధికారిక వాట్సాప్ గ్రూపు నుంచి నేతలు తొలగించారు. (ఢిల్లీలోని ఏడు లోక్ సభ నియోజకవర్గాల్లో ఎందులోనూ ఆప్ విజయం సాధించలేకపోయింది..) కాగా-ఈ ఐదేళ్లూ తాను పార్టీలో కొనసాగానని, ఇది వచ్ఛే ఏడాది ముగుస్తుందని అల్కా లాంబా చెప్పారు. ఈ నగరంలో వచ్ఛే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల ముందే తాను పార్టీ నుంచి నిష్క్రమిస్తానా లేక ఎన్నికల తరువాతా అన్న విషయాన్ని ఆమె స్పష్టం చేయలేదు. తలుపులు మూసేసి ఉన్న గదుల్లో (రహస్యంగా) కూర్చుని అన్ని నిర్ణయాలు తీసుకునే నాయకులపై చర్యలు తీసుకోవాలని అల్కా లాంబా పరోక్షంగా అరవింద్ కేజ్రీవాల్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వాట్సాప్ గ్రూపు నుంచి తనను కొన్నిసార్లు తొలగిస్తారని, మళ్ళీ చేరుస్తారని, ఈ నేతల వైఖరి అంతుబట్టడంలేదని ఆమె పార్టీ నాయకత్వాన్ని దుయ్యబట్టారు. అందుకే ఆత్మపరిశీలన చేసుకునేందుకు ఓ మీటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. అటు-గతంలో కూడా ఈమెను వాట్సాప్ గ్రూపు నుంచి తొలగించి మళ్ళీ ఈమె పేరును చేర్చారు.

Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా