‘మేరా అమేథీ పరివార్… ‘: రాహుల్

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న తనకు ప్రజలు తమ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీ నియోజకవర్గ ప్రజలకు ఓ లేఖ రాశారు. ‘మేరా అమేథీ పరివార్’ అంటూ సంబోధిస్తూ రాసిన ఈ లేఖలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి తీరుతానని కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రజలకు హామీ ఇచ్చారు. బీజేపీ అబద్ధాల కర్మాగారమని, ఓటర్లకు ఓ ప్రవాహంలా డబ్బును […]

'మేరా అమేథీ పరివార్... ': రాహుల్
Follow us

| Edited By:

Updated on: May 03, 2019 | 8:15 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న తనకు ప్రజలు తమ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీ నియోజకవర్గ ప్రజలకు ఓ లేఖ రాశారు. ‘మేరా అమేథీ పరివార్’ అంటూ సంబోధిస్తూ రాసిన ఈ లేఖలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి తీరుతానని కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రజలకు హామీ ఇచ్చారు. బీజేపీ అబద్ధాల కర్మాగారమని, ఓటర్లకు ఓ ప్రవాహంలా డబ్బును పంచిపెడుతూ మభ్యపెడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. నిజాయితీ, సమగ్ర అనే అంశాలే అమేథీ నియోజకవర్గ బలాలని రాహుల్ ఆ లేఖలో వివరించారు.