రాహుల్‌కి ఈసీ క్లీన్ చిట్
బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ఈసీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఏప్రిల్ 23న మధ్యప్రదేశ్ జబల్ పూర్ జిల్లా సిహోరా జిల్లాలో జరిగిన సభలో ఓ హత్యకేసునుద్దేశించి రాహుల్ మాట్లాడుతూ..అమిత్ షా హత్య కేసు నిందితుడు. ఆయన కుమారుడు జయ్ షా ఓ ఇంద్రజాలికుడు అంటూ వ్యాఖ్యానించారు. ఇది ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమేనని ఆరోపిస్తూ బీజేపీ నేత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా రాహుల్ ప్రసంగాన్ని విన్న ఈసీ […]

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ఈసీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఏప్రిల్ 23న మధ్యప్రదేశ్ జబల్ పూర్ జిల్లా సిహోరా జిల్లాలో జరిగిన సభలో ఓ హత్యకేసునుద్దేశించి రాహుల్ మాట్లాడుతూ..అమిత్ షా హత్య కేసు నిందితుడు. ఆయన కుమారుడు జయ్ షా ఓ ఇంద్రజాలికుడు అంటూ వ్యాఖ్యానించారు. ఇది ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమేనని ఆరోపిస్తూ బీజేపీ నేత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా రాహుల్ ప్రసంగాన్ని విన్న ఈసీ ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందకు రాదని తేల్చి చెప్పింది.