గాడిదా.. నువ్వు నాకు తోడుగా… నామినేషన్ వేసిన అభ్యర్థి

సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కోసారి అధికార పార్టీ అభ్యర్ధినే ప్రజలు గుర్తుపట్టడం కష్టంగా మారుతోంది. దీంతో ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నో రకాల వేషాలు వేస్తుంటారు. ఇక స్వత్రంత్ర అభ్యర్ధుల విషయం చెప్పేదేముంది.. ఏదో ఒక రకంగా గుర్తింపు పొందడానికి నానాపాట్లు పడుతుంటారు. ఆ కోవలోదే బీహార్‌లో జరిగిన ఓ వింత సంఘటన ఇది. బీహార్‌లోని జెహానాబాద్ లోక్‌సభ స్థానం నుంచి మణిభూషన్ శర్మ అనే వ్యక్తి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. అయితే అతడు నియోజకవర్గ ఓటర్ల దృష్టిలో […]

గాడిదా.. నువ్వు నాకు తోడుగా... నామినేషన్ వేసిన అభ్యర్థి
Follow us

| Edited By:

Updated on: May 02, 2019 | 7:51 PM

సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కోసారి అధికార పార్టీ అభ్యర్ధినే ప్రజలు గుర్తుపట్టడం కష్టంగా మారుతోంది. దీంతో ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నో రకాల వేషాలు వేస్తుంటారు. ఇక స్వత్రంత్ర అభ్యర్ధుల విషయం చెప్పేదేముంది.. ఏదో ఒక రకంగా గుర్తింపు పొందడానికి నానాపాట్లు పడుతుంటారు. ఆ కోవలోదే బీహార్‌లో జరిగిన ఓ వింత సంఘటన ఇది. బీహార్‌లోని జెహానాబాద్ లోక్‌సభ స్థానం నుంచి మణిభూషన్ శర్మ అనే వ్యక్తి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. అయితే అతడు నియోజకవర్గ ఓటర్ల దృష్టిలో పడేందుకు వైరైటీ ప్లాన్ వేశాడు. సాధారణంగా వచ్చి నామినేషన్ వేస్తే ఎవరు గుర్తుపట్టరనుకున్నాడో ఏమో.. తన బుర్రకు పదును పెట్టాడు. వెంటనే తన బుర్రలోకి వచ్చిన ప్లాన్‌ను వర్కౌట్ చేశాడు. పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్తే డబ్బు ఖర్చు అనుకున్నాడో.. లేదా ప్రచారానికి డబ్బు దండుగ అనుకున్నాడో… గాడిదపై కలెక్టరేట్‌కి వచ్చి నామినేషన్ పర్వాన్ని ముగించాడు. ఇంకేముంది.. గాడిదపై ఊరేగింపుగా వచ్చిన ఆయన ఫోటోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే గాడిదపై ఎందుకు వచ్చానో అతను తెలిపాడు. ప్రధాన పార్టీల నేతలు సామాన్యులను గాడిదలుగా పరిగణిస్తున్నారని.. ఆ విషయం తెలిపేందుకే ఇలా వచ్చి నామినేషన్ వేశానని తెలిపాడు. అయితే అధికారులు మాత్రం జంతు హింస నిరోధక చట్టం కింద అతనిపై కేసు పెట్టారు.