మోదీకి పోటీగా.. వారణాసి బరిలో ప్రియాంక..?

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీని ఢీకొట్టేందుకు ఆమె సిద్ధమయ్యారు. మోదీ రెండోసారి పోటీ చేయబోతున్న వారణాసి నుంచి తాను ఎందుకు పోటీ చేయకూడదంటూ కాంగ్రెస్ కార్యకర్తలను ప్రియాంక ప్రశ్నించారు. దీంతో ఈ విషయం ఇప్పుడు దేశరాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే పార్టీ ఆదేశిస్తే లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమేనని బుధవారం తెలిపిన ప్రియాంక ఆ మరుసటి రోజే సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం […]

మోదీకి పోటీగా.. వారణాసి బరిలో ప్రియాంక..?
Follow us

| Edited By:

Updated on: Mar 29, 2019 | 5:39 PM

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీని ఢీకొట్టేందుకు ఆమె సిద్ధమయ్యారు. మోదీ రెండోసారి పోటీ చేయబోతున్న వారణాసి నుంచి తాను ఎందుకు పోటీ చేయకూడదంటూ కాంగ్రెస్ కార్యకర్తలను ప్రియాంక ప్రశ్నించారు. దీంతో ఈ విషయం ఇప్పుడు దేశరాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అయితే పార్టీ ఆదేశిస్తే లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమేనని బుధవారం తెలిపిన ప్రియాంక ఆ మరుసటి రోజే సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం రాయ్‌బరేలిలో నిర్వహించిన స్థానిక కార్యకర్తలు, నాయకుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఆమెను రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయాలని కోరారు. దానికి బదులిస్తూ వారణాసి నుంచి ఎందుకు పోటీ చేయకూడదు? అంటూ ఎదురు ప్రశ్నించారు. వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి పోటీచేయనున్న నేపథ్యంలో అదే స్థానం నుంచి తాను ఎందుకు బరిలోకి దిగకూడదు అంటూ ఆమె ప్రశ్నించటం గమనార్హం. ఇక ఈ నిర్ణయంపై కాంగ్రెస్ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే నిజంగానే ఆమె వారణాసి నుంచి పోటీ చేస్తే మోదీ, ప్రియాంకల మధ్య హోరాహోరీ పోటీ జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.