కాసేపట్లో బీజేపీ మేనిఫెస్టో విడుదల

న్యూఢిల్లీ : బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోను మరి కాసేపట్లో విడుదల చేయనుంది. “సంకల్ప్ పత్ర్” పేరుతో మేనిఫెస్టోను రిలీజ్ చేయనున్నట్లు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా మేనిఫెస్టోని రూపొందించినట్లు అరుణ్ జైట్లీ తెలిపారు. బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రధానంగా ఉగ్రవాదం, అభివృద్ధి, మహిళా సాధికారత, రామమందిర నిర్మాణం వంటి అంశాలపై దృష్టిసారించనుంది. ఇక నిరుద్యోగ సమస్య దేశాన్ని పట్టిపీడిస్తుండటంతో యువతకు ఉపాధి, నైపుణ్యాల కల్పనపైనా బీజేపీ మేనిఫెస్టో […]

కాసేపట్లో బీజేపీ మేనిఫెస్టో విడుదల
Follow us

| Edited By:

Updated on: Apr 08, 2019 | 11:21 AM

న్యూఢిల్లీ : బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోను మరి కాసేపట్లో విడుదల చేయనుంది. “సంకల్ప్ పత్ర్” పేరుతో మేనిఫెస్టోను రిలీజ్ చేయనున్నట్లు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా మేనిఫెస్టోని రూపొందించినట్లు అరుణ్ జైట్లీ తెలిపారు.

బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రధానంగా ఉగ్రవాదం, అభివృద్ధి, మహిళా సాధికారత, రామమందిర నిర్మాణం వంటి అంశాలపై దృష్టిసారించనుంది. ఇక నిరుద్యోగ సమస్య దేశాన్ని పట్టిపీడిస్తుండటంతో యువతకు ఉపాధి, నైపుణ్యాల కల్పనపైనా బీజేపీ మేనిఫెస్టో ఎలాంటి ప్రస్తావన తీసుకువస్తుందనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీ మేనిఫెస్టో రూపకల్పనలో సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, పియూష్ గోయల్, ముక్తార్ అబ్బాస్ నక్వీ, శివరాజ్ సింగ్ చౌహాన్ పాలుపంచుకున్నారు.