రోడ్డుపై కార్యకర్తను కొట్టిన బాలయ్య.. వీడియో వైరల్
ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే బాలయ్య తరచూ తన అసహనాన్ని బయటపెడుతున్నాడు. తాజాగా ఓ కార్యకర్తను కొట్టి మరో వివాదంలో చిక్కుకున్నాడు బాలయ్య. ప్రచారంలో భాగంగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న బాలయ్య ఉన్నట్లుండి ఓ కార్యకర్తపైకి దూసుకెళ్లి కొట్టాడు. ఈ చర్యకు అక్కడున్న కొందరు బిత్తరపోగా.. మరికొందరు మాత్రం కేకలు వేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే దీనిపై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కూడా […]

ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే బాలయ్య తరచూ తన అసహనాన్ని బయటపెడుతున్నాడు. తాజాగా ఓ కార్యకర్తను కొట్టి మరో వివాదంలో చిక్కుకున్నాడు బాలయ్య. ప్రచారంలో భాగంగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న బాలయ్య ఉన్నట్లుండి ఓ కార్యకర్తపైకి దూసుకెళ్లి కొట్టాడు. ఈ చర్యకు అక్కడున్న కొందరు బిత్తరపోగా.. మరికొందరు మాత్రం కేకలు వేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే దీనిపై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కూడా ఆయన అనర్హుడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే అభిమానులపై చేయి చేసుకోవడం బాలయ్యకు కొత్తేం కాదు. గతంలో కూడా ఆయన పలుమార్లు తన అభిమానులపై దుర్భాషలాడుతూ, చేయి చేసుకున్న విషయం తెలిసిందే.
These are the politicians who are ruling Andhra Pradesh Look how brother in law of @ncbn Hindupur MLA and actor Balakrishna is beating a common man pic.twitter.com/EpQTee0Qed
— Dr.P.S.VishnuVardhan (@drpsvvardhan) April 7, 2019



