టీడీపీ నేత సీకే బాబు ఇంట్లో ఎన్నికల స్క్వాడ్ సోదాలు
ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేత సీకే బాబు ఇంట్లో ఎన్నికల అధికారులు సోదాలు నిర్వహించారు. చిత్తూరు, గంగాధర నెల్లూరు, పూతలపట్టులో పంచేందుకు ఆయన ఇంట్లో నగదు, మద్యాన్ని నిల్వ ఉంచినట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్నికల స్క్వాడ్ అధికారులు, పోలీసుల సాయంతో సోదాలు చేపట్టారు. దాదాపు అరగంట పాటు సీకే బాబు ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. అయితే ఈ సోదాల్లో ఎలాంటి నగదు, మద్యం లభించలేదు. దీంతో వారు వెనుదిరిగారు. కాగా […]

ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేత సీకే బాబు ఇంట్లో ఎన్నికల అధికారులు సోదాలు నిర్వహించారు. చిత్తూరు, గంగాధర నెల్లూరు, పూతలపట్టులో పంచేందుకు ఆయన ఇంట్లో నగదు, మద్యాన్ని నిల్వ ఉంచినట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్నికల స్క్వాడ్ అధికారులు, పోలీసుల సాయంతో సోదాలు చేపట్టారు.
దాదాపు అరగంట పాటు సీకే బాబు ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. అయితే ఈ సోదాల్లో ఎలాంటి నగదు, మద్యం లభించలేదు. దీంతో వారు వెనుదిరిగారు. కాగా ఇటీవల టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డికి చెందిన ఓ కాలేజీలో పోలీసులు సోదాలు జరిపిన విషయం తెలిసిందే.