ప్రజలు ‘అలాంటివారిని చెప్పుతో కొడతారు’…….కాంగ్రెస్ నేతలపై పరోక్షంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు
ప్రజల సమస్యలకు పరిష్కారం చూపకుండా ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామంటే అలాంటి నాయకులను ప్రజలు చెప్పుతో కొడతారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజల సమస్యలకు పరిష్కారం చూపకుండా ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామంటే అలాంటి నాయకులను ప్రజలు చెప్పుతో కొడతారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్ని రాజకీయ పార్టీలు తమ గొంతెమ్మ కోర్కెలను పక్కన బెట్టి ఆర్ధిక వ్యవస్థ, ఆరోగ్య రంగాలపై ఫోకస్ పెట్టాలని ఆయన సూచించారు. శివసేన 55 వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన… పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. ప్రజల సమస్యలకు పరిష్కారం అన్నది ముఖ్యం.. అంతే తప్ప రాజకీయనేతలు తాము ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తామంటే ప్రజలు వారిని క్షమించబోరు అన్నారు. ఈ వైఖరిని పాటించే పార్టీల సెంట్రిక్ విధానాలను వారు వినబోరని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది జరిగే ముంబై స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని ముంబై కాంగ్రెస్ చీఫ్ భోజ్ జగతాప్ ఇటీవల వ్యాఖ్యానించారు. అలాగే ఈ ఎన్నికల్లోనూ.. ఆ తరువాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తాము ఒంటరోగా పోటీ చేస్తామని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోల్ కూడా ఈ మధ్య వ్యాఖ్యానించి కందిరీగల తుట్టెను రేపారు .. బహుశా వీటిని దృష్టిలో పెట్టుకునే థాక్రే ఈ పరోక్ష హెచ్చరికలు చేసినట్టు కనిపిస్తోంది.
శివసేన అధికారం కోసం అంగలార్చడం లేదని, ఇతరుల భారాన్ని మేం అనవసరంగా మోయజాలమని ఆయన అన్నారు. దేశం ముందు ఎకానమీ, హెల్త్ అన్నవి ప్రధాన సవాళ్లుగా ఉన్నాయని, వీటిపై దృష్టి పెట్టకుండా సంకుచిత రాజకీయాలజోలికి పోతే సమస్యల్లో చిక్కుకుంటామని ఉద్ధవ్ థాక్రే చెప్పారు. అసలు పొత్తు లేకుండానే ఎన్నికల్లో పోటీ చేస్తామనే పిలుపును ఇవ్వలేం అని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Gas Cylinder For 10 Rupees : ఈ కంపెనీ బంపర్ ఆఫర్..! 10 రూపాయలకే గ్యాస్ సిలిండర్..? మీరు కూడా అర్హులే..
INDW vs ENGW: ‘డ్రా’ తో గట్టెక్కిన భారత్..! తొలి టెస్టుతో ఆకట్టుకున్న షెఫాలీ, స్నేహ్ రాణా, తానియా