మాటిస్తున్నా.. ప్రాణం పోయేవరకు.. జనసేన విలీనం అవ్వదు
ప్రాణం పోయినా తన పార్టీని ఏ పార్టీలోనూ విలీనం చేయబోనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. జనసేనను బీజేపీలో విలీనం చేస్తారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వార్తలు నమ్మొద్దని పార్టీ కార్యకర్తలు, అభిమానులకు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘‘నా మీద నమ్మకంతో ఓటేసిన ప్రతి ఒక్కరికీ మాటిస్తున్నా. జనసేనను ఏ పార్టీలోనూ కలిపే ప్రసక్తే లేదు. ఓడించబడ్డ ఈ నేల నుంచే చెప్తున్నా. […]
ప్రాణం పోయినా తన పార్టీని ఏ పార్టీలోనూ విలీనం చేయబోనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. జనసేనను బీజేపీలో విలీనం చేస్తారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వార్తలు నమ్మొద్దని పార్టీ కార్యకర్తలు, అభిమానులకు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘‘నా మీద నమ్మకంతో ఓటేసిన ప్రతి ఒక్కరికీ మాటిస్తున్నా. జనసేనను ఏ పార్టీలోనూ కలిపే ప్రసక్తే లేదు. ఓడించబడ్డ ఈ నేల నుంచే చెప్తున్నా.
ఎన్నికల సమయంలో కూడా టీడీపీతో తమ పార్టీ లోపాయికారీ ఒప్పందం అని తప్పుడు ప్రచారం చేశారని గుర్తు చేసిన పవన్.. ఏదైనా ఉంటే బయటకు చెప్పి చేస్తా కానీ.. లోపాయికారీ ఒప్పందాలు పెట్టుకోమన్నారు. పార్టీని నడపడానికి వేల కోట్ల రూపాయల డబ్బు అవసరం లేదని, టన్నుల కొద్ది ఆశయం ఉంటే చాలని ఈ సందర్భంగా పవన్ చెప్పుకొచ్చారు. ఇక మద్యపాన నిషేధంపై తాను ఎప్పుడో మాట్లాడిన మాటలను పట్టుకొని కొందరు తన ఇంటి మీద దాడికి ప్రయత్నించారని.. వారు టీఆర్ఎస్ వ్యక్తులో, కార్యకర్తో తనకు తెలియదని.. ఏదైనా ఉంటే మీడియా ద్వారా ఖండించాలి కానీ, ఇలా ఇంటి మీద దాడులకు దిగడం మంచిది కాదని అన్నారు.