నామినేష‌న్ వేసిన ఒడిషా సీఎం

భువనేశ్వర్ : ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్‌.. హింజ్లీ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఇవాళ నామినేష‌న్ దాఖ‌లు చేశారు. గంజామ్ జిల్లాలోని హింజ్లీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. చాత్రాపూర్‌లోని స‌బ్ క‌లెక్ట‌ర్ ఆఫీసులో బీజేడీ చీఫ్‌ త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను స‌మ‌ర్పించారు. హింజ్లీ నుంచి వ‌రుస‌గా అయిదోసారి న‌వీన్ పోటీకి దిగ‌నున్నారు. అయితే తొలిసారి న‌వీన్ రెండు స్థానాల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. హింజ్లీ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటుగా ఈసారి బీజేపూర్ నుంచి కూడా పోటీ […]

నామినేష‌న్ వేసిన ఒడిషా సీఎం
Follow us

| Edited By:

Updated on: Mar 20, 2019 | 3:41 PM

భువనేశ్వర్ : ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్‌.. హింజ్లీ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఇవాళ నామినేష‌న్ దాఖ‌లు చేశారు. గంజామ్ జిల్లాలోని హింజ్లీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. చాత్రాపూర్‌లోని స‌బ్ క‌లెక్ట‌ర్ ఆఫీసులో బీజేడీ చీఫ్‌ త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను స‌మ‌ర్పించారు. హింజ్లీ నుంచి వ‌రుస‌గా అయిదోసారి న‌వీన్ పోటీకి దిగ‌నున్నారు. అయితే తొలిసారి న‌వీన్ రెండు స్థానాల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. హింజ్లీ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటుగా ఈసారి బీజేపూర్ నుంచి కూడా పోటీ చేయ‌నున్నారు. ఈ రెండు స్థానాల‌కు ఏప్రిల్ 18వ తేదీన ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. కాగా ఎన్నిక‌ల‌కు నామినేష‌న్ దాఖ‌లు చేసిన మొద‌టి బీజేడీ వ్య‌క్తిగా సీఎం న‌వీన్ నిలిచారు.