పాక్ ను మోదీ పిలవనంత మాత్రాన…

ప్రధానిగా తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మోదీ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను ఆహ్వానించనంత మాత్రాన అది ఉభయ దేశాల మైత్రీ సంబంధాలకు అడ్డు రాదని విశ్లేషకులు భావిస్తున్నారు. మోదీ కావాలనే పాకిస్తాన్ ను పక్కన పెట్టారని, దీంతో భారత, పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించవచ్ఛునని వచ్చిన వార్తలను వారు తోసిపుచ్చుతున్నారు. నిజానికి రెండు దేశాల మధ్య సంబంధాలు ఆ మధ్య పుల్వామా ఘటన నేపథ్యంలో కొంత వరకు దెబ్బ తిన్నప్పటికీ.. కాశ్మీర్ […]

పాక్ ను మోదీ  పిలవనంత మాత్రాన...

ప్రధానిగా తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మోదీ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను ఆహ్వానించనంత మాత్రాన అది ఉభయ దేశాల మైత్రీ సంబంధాలకు అడ్డు రాదని విశ్లేషకులు భావిస్తున్నారు. మోదీ కావాలనే పాకిస్తాన్ ను పక్కన పెట్టారని, దీంతో భారత, పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించవచ్ఛునని వచ్చిన వార్తలను వారు తోసిపుచ్చుతున్నారు. నిజానికి రెండు దేశాల మధ్య సంబంధాలు ఆ మధ్య పుల్వామా ఘటన నేపథ్యంలో కొంత వరకు దెబ్బ తిన్నప్పటికీ.. కాశ్మీర్ సమస్యతో సహా,, అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు చర్చలకు తాను సిధ్ధమని ఇమ్రాన్ ఖాన్ మోదీకి చాలాసార్లు స్పష్టం చేశారు. అలాగే పాకిస్తాన్ జాతీయ దినోత్సవం నాడు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ మోదీ లేఖ రాశారు. పైగా ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో మోదీ ఘన విజయానికి గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఇమ్రాన్ ఆయనకు ఫోన్ చేశారు. ఎప్పటికప్పుడు ఉభయ నాయకులూ ఒకరితో ఒకరు టచ్ లో ఉండడానికే ప్రయత్నిస్తున్నారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మోదీ ఈ సారి బిమ్ టిక్ దేశాధినేతలను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. సార్క్ దేశాలను పక్కన బెట్టి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని పత్రికలు వార్తలు రాశాయి. కాగా-తమ దేశాధినేతను మోడీ ఆహ్వానించకపోవడంపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ కూడా తీవ్రంగా స్పందించలేదు.. దీనికి పాక్ ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఉభయ దేశాల సంబంధాలను మోదీ చర్య దెబ్బ తీయదనే ధోరణిలో పాక్ విదేశాంగ మంత్రి మాట్లాడడం విశేషం. కాగా-జూన్ 13, 14 తేదీల్లో బిష్కెక్ లో ఎస్ సి ఓ సమ్మిట్ సందర్భంగా భారత, చైనా నేతలు సమావేశం కానున్నారు. ఆ సమావేశంలో మోదీ, ఇమ్రాన్ ఖాన్
రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై చర్చించవచ్చునని భావిస్తున్నారు.