బీహార్ లో మే 15 వరకు నైట్ కర్ఫ్యూ, సినిమా హాళ్లు, జిమ్ సెంటర్లు, మాల్స్, స్కూల్స్, కాలేజీలు బంద్
కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా ఆదివారం రాత్రి 9 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూను విధిస్తున్నట్టు బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు.
కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా ఆదివారం రాత్రి 9 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూను విధిస్తున్నట్టు బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు. ఈ కర్ఫ్యూ ఉదయం 5 గంటలవరకు ఉంటుందని ఆయన చెప్పారు. అలాగే రాష్ట్రంలో సినిమా హాళ్లు, మాల్స్, స్కూళ్ళు, కాలేజీలు, జిమ్ సెంటర్లు పార్కులు అన్నీ మే నెల 15 వరకు మూసి ఉంచుతున్నట్టు ఆయన చెప్పారు. పండ్లు, కూరగాయలు అమ్మే షాపులు సాయంత్రం 6 గంటల వరకే పని చేస్తాయన్నారు. హోటళ్లలో పార్సిల్ సేవలు మాత్రమే ఉంటాయని, అది కూడా రాత్రి 9 గంటలవరకేనని నితీష్ కుమార్ వెల్లడించారు. మే 15 వరకు స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలలో ఎలాంటి పరీక్షలను అనుమతించబోమని అన్నారు. అయితే హెల్త్ కేర్ వర్కర్లకు గత ఏడాది మాదిరే ఈ సారి కూడా ఒక నెల బోనస్ శాలరీ ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన చెప్పారు.
ఇలా ఉండగా తమిళనాడులో ఈ నెల 20 నుంచి రాత్రి కర్ఫ్యూను విదించనున్నారు. ఈ ఆంక్షలు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటలవరకు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఆదివారం రోజుల్లో పూర్తి లాక్ డౌన్ విధిస్తారు. కాగా నైట్ కర్ఫ్యులో నిత్యవసర సర్వీసులను మాత్రం అనుమతిస్తారు. అలాగే జర్నలిస్టులను, రాత్రివేళ పని చేసే ఉద్యోగులను వారు ఐడీ కార్డు చూపిన పక్షంలో అనుమతిస్తామని అధికారులు తెలిపారు. కోవిడ్ కేసులు పెరిగిన ఫలితంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు వారు చెప్పారు. ఇక ఢిల్లీలో కూడాఇలాగె ఆంక్షలను మరింత కట్టుదిట్టం చేయనున్నారు. ఇప్పటికే వీకెండ్ కర్ఫ్యూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
మరిన్ని ఇక్కడ చూడండి: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. ప్రాణవాయువుకు అధిక డిమాండ్.. పరుగులు తీయనున్న ‘ఆక్సిజన్ ఎక్స్ప్రెస్’ రైళ్లు
Coronavirus: కరోనా వైరస్ కొత్త లక్షణాలు ఇవే.. ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు.. వైద్యుల హెచ్చరిక..