Nagarjuna Sagar By-Poll: ముగిసిన ప్రచారం..నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు పార్టీలు సిద్ధం!

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. అన్ని పార్టీలు గెలుపు కోసం సర్వ విధాలుగా ప్రచారాన్ని హోరెత్తించాయి. ఏప్రిల్ 17న ఎన్నిక జరుగనుంది. ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలతో పాటే మే 2న కౌంటింగ్ జరుగుతుంది.

  • KVD Varma
  • Publish Date - 10:16 pm, Thu, 15 April 21
Nagarjuna Sagar By-Poll: ముగిసిన ప్రచారం..నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు పార్టీలు సిద్ధం!
Nagarjuna Sagar Bypoll

Nagarjuna Sagar By-Poll: నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. అన్ని పార్టీలు గెలుపు కోసం సర్వ విధాలుగా ప్రచారాన్ని హోరెత్తించాయి. ఏప్రిల్ 17న ఎన్నిక జరుగనుంది. ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలతో పాటే మే 2న కౌంటింగ్ జరుగుతుంది. అధికార టీఆర్ఎస్..కాంగ్రెస్..బీజేపీ పార్టీల మధ్య ముక్కోణపు పోరు ఇక్కడ నెలకొంది. ప్రచారంలో మూడు పార్టీలు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డాయి. ఇక ప్రచారం ముగియడానికి ఒక్కరోజు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ హాలియాలో నిర్వహించిన బహిరంగ సభ ఆ పార్టీ శ్రేణులను ఉత్సాహంలో నింపేసింది. మరోవైపు కాంగ్రెస్ నుంచి జానారెడ్డి ఒంటరిపోరు చేస్తున్నారు. ఇక బీజేపీ అంతర్గత లుకలుకలతో సతమతమౌతోంది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గుర్రంపోడు, పెద్దవూర, తిరుమలగిరిసాగర్‌, హాలియా, నిడమనూరు, త్రిపురారం మండలాలు పూర్తిగానూ, మాడ్గులపల్లి మండలంలోని కొన్ని గ్రామాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో అన్ని మండలాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల నర్సింహయ్యకు స్పష్టమైన ఆధిక్యం లభించింది. అయితే, ఒక్క త్రిపురారం మండలంలో మాత్రం కాంగ్రెస్ కు స్వల్పంగా 235 ఓట్ల ఆధిక్యం వచ్చింది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ మంచి విజయాలు మూటగట్టుకుంది. హాలియా, నందికొండ మున్సిపాలిటీలను ఏకపక్షంగా గెలిచింది టీఆర్ఎస్.

నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,19,024 కాగా, అందులో పురుషులు 1,08,597, మహిళలు 1,10,517 మంది ఉన్నారు. ఇక కులాల వారీగా చూస్తె..బీసీ-1,05,495, బీసీల్లో యాదవ సామాజిక వర్గం-34,267, ఎస్సీ-37,671, ఎస్టీ-40,398, ఓసీ-31,485, ఇతరులు-2,151 ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో (2018) నోముల నర్సింహ్మయ్య చేతిలో 7,726 ఓట్ల తేడాతో జానారెడ్డి ఓటమి చెందారు. అప్పుడు మొత్తం 1,80,765 ఓట్లు పోలవ్వగా.. అందులో నోముల నర్సింహ్మయ్య (టీఆర్‌ఎస్‌)కు 83,743 (46.33 శాతం), కె. జానారెడ్డి (కాంగ్రెస్‌)కు 76,017 (42.05 శాతం), వి. రామకృష్ణారెడ్ది (సమాజ్‌వాది ఫార్వర్డ్‌బ్లాక్‌)కు 9,832 (5.44 శాతం), కె. నివేదిత (బీజేపీ) 2,682 (1.48 శాతం) ఓట్లు వచ్చాయి.

ఇక ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధుల వివరాలు..

కుందూరు జానారెడ్డి-కాంగ్రెస్ :
పుట్టింది – అనుముల గ్రామం, నల్గొండ జిల్లా
పుట్టిన తేదీ – 20-06-2046
ఇద్దరు కుమారులు – రఘువీర్‌, జైవీర్‌
టీడీపీలో చేరి రాజకీయ జీవితం ఆరంభం
1983లో చలకుర్తి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపు
1985లో రెండోసారి టీడీపీ ఎమ్మెల్యేగా చలకుర్తి నుంచి గెలుపు
1989లో కాంగ్రెస్‌లో చేరి మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపు
1994 లో టీడీపీ అభ్యర్ధి రామమూర్తి చేతిలో తొలిసారి ఓటమి
1999, 2004, 2009, 2014 ఎన్నికలలో వరుస విజయాలు
2009లో చలకుర్తి స్థానంలో నాగార్జునసాగర్‌ నియోజకవర్గం ఏర్పాటు
నాగార్జునసాగర్‌ నియోజకవర్గం నుంచి కూడా రెండుసార్లు గెలుపు
2018లో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి నోముల నర్సింహ్మయ్య చేతిలో ఓటమి
మొత్తం ఏడుసార్లు గెలుపు, రెండుసార్లు ఓటమి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన రికార్డు జానారెడ్డికి ఉంది. 1983,1985 సంవత్సరాలలో ఎన్టీఆర్‌ కేబినెట్‌లో మంత్రి పదవి, కాంగ్రెస్‌లో 1992-1994 మధ్య, తిరిగి 2004-2014 వరకూ మంత్రి పదవి నిర్వహించిన ఆయన 15 సంవత్సరాలకుపైనే మంత్రిగా పనిచేసి అత్యధికకాలం ఆ పదవిలో ఉన్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఎన్టీఆర్‌ హయాంలో 13 మంత్రిత్వ శాఖలకు మంత్రిగా జానారెడ్డి పనిచేశారు. కోట్ల విజయభాస్కరరెడ్డి, వైఎస్ఆర్‌, కిరణ్‌కుమార్ రెడ్డి కేబినెట్‌ లలో కూడా మంత్రిగా ఉన్నారు. వ్యవసాయం, సహకారసంఘాలు, మార్కెటింగ్‌, అటవీ, రవాణా, రోడ్డు భవనాలు, పంచాయతీరాజ్‌ వంటి అనేక శాఖలకు జానారెడ్డి మంత్రిగా పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నేత నోముల నర్సింహ్మయ్య చేతిలో 7,726 ఓట్ల తేడాతో ఓటమి చెందారు.

నోముల భగత్ కుమార్,టీఆర్ఎస్ అభ్యర్థి:
ప్రస్తుతం : న్యాయవాది, హైకోర్టు ఆఫ్ తెలంగాణ
తండ్రి పేరు : దివంగత నోములనర్సింహయ్య
పుట్టిన తేదీ: 10-10-1984
విద్యార్హతలు:
B.E., M.B.A., L.L.B, L.L.M. :
సత్యం టెక్నాలజీస్ లిమిటెడ్, విస్టా ఫార్మా స్యూటికల్స్ లిమిటెడ్‌లో మేనేజర్ గా అనుభవం
2014 లో టీఆర్‌ఎస్‌లో చేరిక
నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో (2014 – ప్రస్తుతం) 2014 – 2018సాధారణ ఎన్నికల ఆర్గనైజర్
2018 అసెంబ్లీ ఎన్నికలు, అన్ని స్థానిక సంస్థల ఎన్నికలలో కీలకపాత్ర
2020 నుండి శాసనమండలి ఎన్నికల్లో అభ్యర్థి గెలుపుకు కృష్టి
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు పార్టీ కేడర్ సమస్యల పరిష్కారం కోసం సేవలు
సివిక్ప్రొఫైల్ చైర్మన్
నోముల ఎన్.ఎల్. ఫౌండేషన్ చైర్మన్
పేద కుటుంబాలకు అవసరమైన విద్యార్థులకు ఉచిత విద్య, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించిన భగత్
ఆశావాదుల ఉపాధికి కోచింగ్ క్లాసులు , జాబ్ మేళాలు నిర్వహణ
కుటుంబ నేపథ్యం
తల్లి- నోముల లక్ష్మి
భార్య – నోముల భవానీ, కుమారుడు – నోముల రానాజయ్
కుమార్తె- నోముల రేయాశ్రీ
చిరునామా : బృందావనం కాలనీ, హాలియా, నల్గొండ జిల్లా.
సోషల్ మీడియా : https://www.facebo0ok.com/BagathNomula/: కాంటాక్ట్స్: ఫోన్ – 9849888482, 9449 nomula bhagat @ gmail.com

రవికుమార్, బీజేపీ అభ్యర్థి
పూర్తి పేరు : ఫాను గోతు రవికుమార్
స్వగ్రామం: పలుగు తండ త్రిపురారం మండలం
పుట్టిన తేదీ: 09-06-1985
భార్య: పానుగోతు సంతోషి
తల్లిదండ్రులు: పానుగోతు హరి, పానుగోతు దస్సి
పిల్లలు: మన స్వీత్, వీనస్
విద్యార్హతలు: ఎం బి బి ఎస్
వృత్తి: ప్రభుత్వ వైద్యుడు
( ప్రస్తుతం రాజీనామా )
పలు ఆస్పత్రులలో సివిల్ సర్జన్ గా ఉద్యోగ బాధ్యతలు. నిర్మల ఫౌండేషన్ చైర్మన్, పలు మండలాలలో సామాజిక కార్యక్రమాలు నిర్వహణ

Also Read: సీఎం పదవి తెలంగాణ ప్రజలు పెట్టిన బిక్ష.. ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి నేరుగా రైతు ఖాతాలో జమ చేస్తాంః కేసీఆర్

CM KCR in Sagar by poll: రేపటితో ముగియనున్న సాగర్ ఉప ఎన్నిక ప్రచారం.. మరికాసేపట్లో హాలియాలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభ