మోదీకి మతి భ్రమించింది : భూపేశ్ బాఘేల్
ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్. రాజీవ్ గాంధీ నంబర్ వన్ అవినీతి పరుడు అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి మతి భ్రమించిందని, సరిగా నిద్రలేకపోవడంతో ఆయనకు.. ఈ పరిస్థితి ఏర్పడిందని, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి సరైన చికిత్స అందించాలంటూ ఎద్దేవా చేశారు. ‘‘రాజీవ్ గాంధీ చనిపోయి చాలా ఏళ్లైంది. ఆయన గురించి ఇప్పుడు మాట్లాడటమేంటి? మోదీ మానసిక స్థితి బాగాలేదని.. ఆయన […]

ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్. రాజీవ్ గాంధీ నంబర్ వన్ అవినీతి పరుడు అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి మతి భ్రమించిందని, సరిగా నిద్రలేకపోవడంతో ఆయనకు.. ఈ పరిస్థితి ఏర్పడిందని, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి సరైన చికిత్స అందించాలంటూ ఎద్దేవా చేశారు.
‘‘రాజీవ్ గాంధీ చనిపోయి చాలా ఏళ్లైంది. ఆయన గురించి ఇప్పుడు మాట్లాడటమేంటి? మోదీ మానసిక స్థితి బాగాలేదని.. ఆయన రోజులో 3 నుంచి 4 గంటలు మాత్రమే నిద్రపోతారని అన్నారు. సరిగా నిద్రపోనివారు మానసిక అనారోగ్యానికి గురవుతుంటారని.. మోదీకి కూడా అలాంటి జబ్బే వచ్చిందని.. ఆయనను మంచి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించాల్సిన అవసరం ఎంతో ఉందని బాఘేల్ అన్నారు.