MLC Elections Results: కొనసాగుతోన్న కౌంటింగ్.. ఆ స్థానంలో 55 మంది ఎలిమినేషన్
MLC Elections Results: తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సుదీర్ఘంగా కొనసాగుతోంది. మూడు రోజుల నుంచి కౌంటింగ్ కొనసాగుతున్నప్పటికీ తుది ఫలితం ఇంకా..
తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సుదీర్ఘంగా కొనసాగుతోంది. మూడు రోజుల నుంచి కౌంటింగ్ కొనసాగుతున్నప్పటికీ తుది ఫలితం ఇంకా తేలనేలేదు. దీంతో అటు అభ్యర్థులు, ఇటు పార్టీల కేడర్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తుది ఫలితం తేలడానికి ఇంకా 24 గంటల సమయం పట్టే అవకాశం ఉందని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు చెబుతున్నారు. రెండో ప్రాధాన్యతా ఓట్లలో ఇప్పటికే 55 మంది ఎలిమినేషన్ అయ్యారని తెలిపారు.
మరోవైపు మూడు రోజులుగా ఓ క్రమ పద్దతిలో కౌంటింగ్ జరుగుతోందని, అసత్యాలను ప్రచారం చేయవద్దంటున్నారు పోలీస్ ధికారులు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభధ్రుల నియోజకవర్గంలో 71 మంది అభ్యర్థులు పోటీ చేశారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి మొదటి స్థానంలో, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో, టీజేఎస్ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరాం మూడో స్థానంలో నిలిచారు.
అయితే ప్రథమ ప్రాధాన్యత ఓట్ల సంఖ్య పరంగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న కంటే సుమారు 7.5 శాతం ఓట్లు అదనంగా సాధించారు. కోదండరాం కంటే తీన్మార్ మల్లన్న సుమారు 2.5 శాతం ఓట్లు ఎక్కువ సాధించారు. పల్లా ముందంజలో ఉన్నా మల్లన్న, కోదండరాంలకు ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు ఎక్కువ వస్తే.. ప్రధాన పోటీదారుల స్థానాలు తారుమారయ్యే అవకాశముందని తెలుస్తోంది.
ఇక, బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి ఎస్.రాములు నాయక్ బ్యాలెట్స్‌లోని ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు మల్లన్న, కోదండరాం గెలుపోటములను ప్రభావితం చేయనున్నట్లు కనిపిస్తుంది. వీరితో పాటు సీపీఐ అభ్యర్థి జయసారధిరెడ్డి , తెలంగాణ ఇంటి పార్టీ చెరుకు సుధాకర్ , యువ తెలంగాణ అభ్యర్థి రాణీరుద్రమ బ్యాలెట్లలోని రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా పల్లా, మల్లన్న, కోదండరాం సాధించే ఫలితంపై కొంత మేర ప్రభావం చూపే అవకాశముంది.
పట్టభద్రుల స్థానాల కోటా ఓట్ల లెక్కింపు ప్రారంభమై మూడు రోజులు గడుస్తున్నా ఎవరు విజేతగా నిలుస్తారనే అంశంపై స్పష్టత రాకపోవడంతో అన్ని వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. జన సామాన్యానికి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు, ఎలిమినేషన్ విధానంపై అవగాహన లేకపోవడంతో ఎవరికి వారుగా తుది ఫలితం ఎలా ఉంటుందనే అంశంపై ఆరా తీస్తున్నారు.
హైదరాబాద్ పరిధిలో 93, నల్గొండ నియోజకవర్గంలో 71 మంది అభ్యర్థులు పోటీ చేయడంతో ఎలిమినేషన్ విధానంలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు నెమ్మదిగా కొనసాగుతుంది. ఎలిమినేషన్ ప్రక్రియలో రెండు స్థానాల్లోనూ కేవలం ఐదారుగురు అభ్యర్థులు మాత్రమే లెక్కింపు బరిలో మిగిలే అవకాశం కనిపిస్తుంది.
Read More:
MLC Elections Results: కొనసాగుతోన్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు.. ఆ స్థానంలో దూబూచులాడుతున్న గెలుపు
Temple Corona: అర్చకులకు సోకిన కరోనా.. తెలంగాణ చిన్న తిరుపతి 15 రోజులు మూసివేత
MLC Elections Counting Live: