AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సైడ్ ఇన్‌కమ్ వేట.. ఎమ్మెల్యేల బాట..ఇంతకీ ఎక్కడ ?

కష్టపడి గెలిచాం.ఐదేళ్ల వరకు ఢోకా లేదు.అడిగే వారు లేరు అసలే లేరు.కను చూపు మేరలో ఎన్నికలు కూడా లేవు. అభివృద్ది పనులు అంతంత మాత్రమే… అందుకే ఎమ్మెల్యేలు ఎన్నికల ఖర్చు రాబట్టుకునేందుకు సైడ్ దందా స్టార్ట్ చేశారా..? రియల్ ఎస్టేట్ వైపు కన్నేశారా..? బిజినెస్ మెన్ అవతారం ఎత్తడం వల్లే నియోజకవర్గాలకు అడపాదడపా వచ్చిపోతున్నారా…..? అంటే అవుననే అంటున్నారు గులాబీ శ్రేణులు. అసలు ఆ ఎమ్మెల్యేలు చేస్తున్న సైడ్ దందాలేంటి? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన […]

సైడ్ ఇన్‌కమ్ వేట.. ఎమ్మెల్యేల బాట..ఇంతకీ ఎక్కడ ?
Rajesh Sharma
| Edited By: |

Updated on: Nov 06, 2019 | 5:23 PM

Share
కష్టపడి గెలిచాం.ఐదేళ్ల వరకు ఢోకా లేదు.అడిగే వారు లేరు అసలే లేరు.కను చూపు మేరలో ఎన్నికలు కూడా లేవు. అభివృద్ది పనులు అంతంత మాత్రమే… అందుకే ఎమ్మెల్యేలు ఎన్నికల ఖర్చు రాబట్టుకునేందుకు సైడ్ దందా స్టార్ట్ చేశారా..? రియల్ ఎస్టేట్ వైపు కన్నేశారా..? బిజినెస్ మెన్ అవతారం ఎత్తడం వల్లే నియోజకవర్గాలకు అడపాదడపా వచ్చిపోతున్నారా…..? అంటే అవుననే అంటున్నారు గులాబీ శ్రేణులు. అసలు ఆ ఎమ్మెల్యేలు చేస్తున్న సైడ్ దందాలేంటి?
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ 9 స్ధానాల్లో 8 సీట్లు గెలుచుకుంది. ఎల్లారెడ్డి లో కాంగ్రెస్ గెలిచినా కొద్ది రోజుల్లోనే ఆయన కారెక్కేశారు. ప్రస్తుతం 9 నియోజకవర్గాల్లో గులాబీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. 9 మందిలో ఒకరు స్పీకర్ గా ఉండగా మరొకరు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరొకరు విప్ బాధ్యతల్లో ఉన్నారు. ఐతే చాలా మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు ముఖం చాటేశారట.
ఎన్నికల్లో పెట్టిన ఖర్చులు రాబట్టుకునేందుకు సైడ్ బిజినెస్ మొదలెట్టారట. ఒకవైపు పవర్ ఎంజాయి చేస్తూనే మరో వైపు కొందరు రియల్ ఎస్టేట్స్ వ్యాపారంలో, మరికొందరు ఇతర వ్యాపారాల్లో బిజీ అయ్యారట. అందుకే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు భూతద్దాలు పెట్టి వెతికినా కనపడటం లేదట. కొందరు ఎమ్మెల్యేలు అడపాదడపా చిన్న చిన్న షాపుల ఓపెనింగ్ కు వస్తూ.. అలా మెరిసిపోతున్నారట.
పార్లమెంట్ ఎన్నికల నుంచి ఓ ఎమ్మెల్యే నియోజకవర్గానికి ముఖం చాటేశారట. విదేశాల్లో ఉన్న తన వ్యాపారాల్లో సదరు ఎమ్మెల్యే బిజీ అయ్యారనే టాక్ నడుస్తోంది. అభివృద్ది పనులకు నిధులు లేక, పనులు మధ్యలో ఆగిపోవడం, నియోజకవర్గ నిధులు తగ్గిపోవడం తో ప్రత్యామ్నాయం వైపు దృష్టిపెట్టారనే టాక్ నడుస్తోంది. జిల్లా కేంద్రానికి దగ్గర్లో ఉండే మరో ఎమ్మెల్యే వారంలో ఒక్కరోజు మాత్రమే అంటూ నియోజకవర్గానికి వస్తున్నారట. దీంతో కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు  తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మెజార్టీ ఎమ్మెల్యేలు రెండోసారి విజయం సాధించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గత ఎన్నికల కంటే రెట్టింపు ఖర్చు పెట్టారట. కొందరు ఇప్పటికీ అప్పులు కడుతుంటే మరికొందరు ఖర్చులను రాబట్టుకునేందుకు బిజినెస్ మెన్ అవతారం ఎత్తారట. ఎమ్మెల్యే గిరీ చేస్తే అప్పులు తీరవంటూ సైడ్ దందాలు మొదలెట్టారట.
గెలిచిన ఎమ్మెల్యేల్లో చాలా మంది కాంట్రాక్టర్లు, బిల్టర్లుగా ఉండి, రాజకీయ ఆరగేంట్రం చేశారు. మొదటి సారి ఈజీగా గెలిచారు. రెండోసారి గెలిస్తే మంత్రి పదవి వస్తుందనే ఆశతో.. ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు చేశారు. ఇప్పుడు ఆ ఖర్చులు రాబట్టుకునేందుకు సర్కారు పనులపై ఆశ లేకపోవవడంతో.. పాత బిజినెస్ లపై దృష్టిపెట్టారట.
ఇందూరులో ఇంకో ఎమ్మెల్యే ఓ అడుగు ముందుకేసి భూకబ్జాలు, ల్యాండ్ సెటిల్ మెంట్ల కోసం ఓ గ్యాంగ్ ని సిద్దం చేశారనే టాక్ నడుస్తోంది. ఇంకొకరు ఓ కార్పొరేషన్ స్ధలాన్ని లీజుకు తీసుకుని భారీ షాంపిగ్ కాంప్లెక్స్ కట్టేశారట. ఇలా చాలా మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి రాకుండా బిజీగా మారిపోయారట.  ఎమ్మెల్యేల బిజినెస్ లు విషయం అధిష్ఠానానికి తెలిసినా.. ఐతే ఓకే అంటున్నారట.
ఎన్నికల సంవత్సరం వరకు తమ సొంత వ్యాపారాలు బాగు చేసుకుని చివరి సంవత్సరం నియోజకవర్గంలోనే ఉండాలనే ప్లాన్ తో ఉన్నారట శాసన సభ్యులు. ఐతే నియోజకవర్గాల ప్రజలు మాత్రం ఎమ్మెల్యేల కోసం కార్యాలయాల చుట్టు చెప్పులరిగేలా తిరుగుతున్నా.. కంటికి కనిపించడం లేదని ఊసురుమంటున్నారట.
ప్రజా ప్రతినిధులుగా గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో లేకుండా అజ్ఞాతవాసంలో ఉండటం పట్ల నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. సొంత పనులు చక్క బెట్టుకున్నా.. నియోజకవర్గ ప్రజలకు సమయం ఇవ్వాలని కోరుతున్నారు. మరీ ఆ బిజినెస్ మెన్లు ఏ మేరకు అందుబాటులోకి వస్తారో వేచిచూడాలి.