5 ఏళ్లలో 5 ట్రిలియన్ల ఆర్థిక శక్తిగా భారత్ ఎదగాలి

ప్రధానిగా మోదీ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.  2024 నాటికి 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగడానికి అందరూ క‌ృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆర్థిక శక్తిగా అవతరించడం సవాలైనా..రాష్ట్రాల సమిష్టి కృష్టితో సాధ్యమేనని తెలిపారు. రాష్ట్రాలు తమ ఆర్థిక సామర్థ్యాన్ని గుర్తించాలని, జీడీపీ లక్ష్యం పెంచడంపై కృషి చేయాలని చెప్పారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో పని చేయాల్సిన […]

5 ఏళ్లలో 5 ట్రిలియన్ల ఆర్థిక శక్తిగా భారత్ ఎదగాలి
Follow us

|

Updated on: Jun 15, 2019 | 6:32 PM

ప్రధానిగా మోదీ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.  2024 నాటికి 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగడానికి అందరూ క‌ృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆర్థిక శక్తిగా అవతరించడం సవాలైనా..రాష్ట్రాల సమిష్టి కృష్టితో సాధ్యమేనని తెలిపారు. రాష్ట్రాలు తమ ఆర్థిక సామర్థ్యాన్ని గుర్తించాలని, జీడీపీ లక్ష్యం పెంచడంపై కృషి చేయాలని చెప్పారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో పని చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. కాగా శనివారంలో ఢిల్లీలో జరిగిన మీటింగ్  ప్రధాని మోదీ అధ్యక్షతన ఇది ఐదో నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం కావడం విశేషం. ఈ సమావేశంలో మోదీ.. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్‌లకు దిశా నిర్దేశం చేశారు. దేశంలో ఎన్నికలు పూర్తయ్యాయని..ఇక దేశాభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. పేదరికం, నిరుద్యోగం, కరువు, వరదలు, కాలుష్యం, అవినీతి, హింసపై పోరాడాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశానికి కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మల సీతారామన్, రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు. ఐతే తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు.