AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేసీఆర్‌పై కోమటిరెడ్డి ఫైర్

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైరయ్యారు.   ప్రధాని నరేంద్ర మోడీ సేవ తప్ప కేసిఆర్ కుటుంబం ప్రజలకు ఒరగబెట్టింది ఏమి లేదని ఎద్దేవా చేశారు.  భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.  గడిచిన ఐదేళ్లలో 15 ఎంపీ సీట్లు ఉంటేనే మోడీకి పాద సేవ చేసిన కేసీఆర్.. ఇప్పుడు 16 గెలిసినా చేసేదేమి లేదని అన్నారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను […]

కేసీఆర్‌పై కోమటిరెడ్డి ఫైర్
Ram Naramaneni
|

Updated on: Mar 25, 2019 | 4:23 PM

Share

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైరయ్యారు.   ప్రధాని నరేంద్ర మోడీ సేవ తప్ప కేసిఆర్ కుటుంబం ప్రజలకు ఒరగబెట్టింది ఏమి లేదని ఎద్దేవా చేశారు.  భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.  గడిచిన ఐదేళ్లలో 15 ఎంపీ సీట్లు ఉంటేనే మోడీకి పాద సేవ చేసిన కేసీఆర్.. ఇప్పుడు 16 గెలిసినా చేసేదేమి లేదని అన్నారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను గెలిపించాలని పిలుపునిచ్చిన కోమటిరెడ్డి.. టీఆర్ఎస్ బీజేపీ’బీ’ టీం అంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియా గాంధీకి దక్కుతుందని..ప్రజలు ఈ విషయాన్ని గుర్తించుకోని రాబోయే ఎన్నికల్లో ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. గతంలో తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నో సేవలు చేశారని…ఇప్పుడు తనను గెలిపిస్తే విసృతంగా సేవలందించి తెలంగాణ ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు.

Follow Us