తమ్ముడలా అన్నాడా.. నో కామెంట్.. : వెంకట్‌రెడ్డి
నల్గొండ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీ అధిష్టానంపై సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ఆయన సోదరుడు నల్గొండ ఎంపీ కూడా అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కప్పదాటు వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నారా.. అన్న మీడియా ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం ఇవ్వకుండా.. దీనిపై రాజగోపాల్ రెడ్డినే అడగండంటూ తప్పించుకున్నారు. ఇదే సందర్భంలో కేసీఆర్ అన్న కూతురు ఏం చేసిందో.. మీకు తెలిసిందేగా అంటూ వ్యాఖ్యానించారు. ఒక […]
![తమ్ముడలా అన్నాడా.. నో కామెంట్.. : వెంకట్‌రెడ్డి](https://images.tv9telugu.com/wp-content/uploads/2019/06/Komatreddy-venkatreddy.jpg?w=1280)
నల్గొండ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీ అధిష్టానంపై సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ఆయన సోదరుడు నల్గొండ ఎంపీ కూడా అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కప్పదాటు వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నారా.. అన్న మీడియా ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం ఇవ్వకుండా.. దీనిపై రాజగోపాల్ రెడ్డినే అడగండంటూ తప్పించుకున్నారు. ఇదే సందర్భంలో కేసీఆర్ అన్న కూతురు ఏం చేసిందో.. మీకు తెలిసిందేగా అంటూ వ్యాఖ్యానించారు. ఒక కుటుంబం లోని వారు రెండు పార్టీల్లో ఉంటే తప్పేముందంటూ మాట దాటేశారు. తాను మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడనని.. రాష్ట్రంలో టీ పీసీసీ పదవి ఇస్తే.. కాంగ్రెస్‌కు పునర్వైభవం తీసుకోస్తానని అన్నారు.