Sreeleela: సెన్సేషనల్ సినిమాతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ
నదులన్నీ వెళ్లి సముద్రంలో కలిసినట్లు.. మన హీరోయిన్ల అంతిమలక్ష్యం బాలీవుడ్ అవుతుంది. సౌత్‌లో ఎన్ని సినిమాలు చేసినా, ఎంత క్రేజ్ ఉన్నా.. ఒక్కసారి ముంబై వెళ్లి వాళ్లకు మొహం చూపిస్తే చాలు అనుకుంటున్నారు మన ముద్దుగుమ్మలు. తాజాగా మరో స్టార్ హీరోయిన్ సైతం బాలీవుడ్ బాట పట్టింది.. ఆమె తొలి సినిమా టీజర్ కూడా విడుదలైంది.
Updated on: Feb 17, 2025 | 10:00 PM

శ్రీలీల.. సెన్సేషన్ ఆఫ్ టాలీవుడ్.. ఈ మధ్యే కోలీవుడ్‌లో కూడా అడుగు పెట్టింది. అక్కడ శివకార్తికేయన్‌తో పరాశక్తి సినిమాలో నటిస్తున్నారు ఈ బ్యూటీ. తాజాగా బాలీవుడ్‌లోనూ అడుగు పెడుతున్నారు ఈ భామ. కొన్ని రోజులుగా శ్రీలీల బాలీవుడ్ డెబ్యూపై వార్తలొస్తూనే ఉన్నాయి.. ఇప్పుడు సాక్ష్యం కూడా వచ్చింది. తొలి సినిమా టీజర్ విడుదలైంది.

మర్డర్ ఫేమ్ అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తిక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు శ్రీలీల. టీజర్ చూస్తుంటే ఆషికి 3 అని అర్థమవుతుంది.

ముందు ఈ సినిమాలో త్రిప్తి దిమ్రిని పీమేల్ లీడ్‌గా తీసుకున్నా.. తాజాగా శ్రీలీల ఆమెను రీ ప్లేస్ చేసారు. బాలీవుడ్ క్లాసిక్స్‌లో ఆషికి ఫ్రాంచైజీ ఒకటి. 13 ఏళ్ళ తర్వాత ఈ సిరీస్‌లో పార్ట్ 3 వస్తుంది.

ముందు ఈ సినిమాలో త్రిప్తి దిమ్రిని పీమేల్ లీడ్‌గా తీసుకున్నా.. తాజాగా శ్రీలీల ఆమెను రీ ప్లేస్ చేసారు. బాలీవుడ్ క్లాసిక్స్‌లో ఆషికి ఫ్రాంచైజీ ఒకటి. 13 ఏళ్ళ తర్వాత ఈ సిరీస్‌లో పార్ట్ 3 వస్తుంది.

టాలీవుడ్ టూ బాలీవుడ్ శ్రీలీల పేరు మార్మోగిపోతుందిప్పుడు. ఆషికి 3తో శ్రీలీలకు డ్రీమ్ డెబ్యూ దొరికినట్లే. అప్పట్లో ఆషికి 2తో శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా పరిచయమై స్టార్ అయ్యారు. ఇప్పటికే పుష్ప 2లో కిసిక్ పాటతో నార్త్‌ను ఊపేసిన లీల.. కార్తిక్ ఆర్యన్ సినిమాతో తన లీలలు మరిన్ని చూపించబోతున్నారని టీజర్ చూస్తుంటేనే అర్థమైపోతుంది.




