GBS.. ఏపీలో మరో హైరానా! ఈ అరుదైన వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే.?
అటు ఏపీ..ఇటు తెలంగాణ రాష్ట్రాలను బర్డ్‌ఫ్లూకు మించి హైరానా పెడుతోంది..జీబీఎస్ వ్యాధి. ఇప్పటివరకూ బాధితులు మాత్రమే ఉండగా.. తాజాగా మరణాలు కూడా మొదలవడంతో జనం టెన్షన్ పడుతున్నారు. ప్రభుత్వాలు భయం లేదని భరోసా ఇస్తున్నా కూడా..ఇది మరో కరోనాలా మారుతుందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంతకూ ఏంటి ఈ "గులియన్ బారే సిండ్రోమ్"..? ఈ వ్యాధి ఒకరినుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉందా..? వ్యాధిని ఎలా గుర్తించాలి..రాకుండా ఎలా కాపాడుకోవాలి..?

గులియన్ బారే సిండ్రోమ్..తెలుగు రాష్ట్రాల ప్రజలను వణికిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ఒకరిని..ఏపీలో ఇద్దరిని బలి తీసుకుంది ఈ వ్యాధి. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందలపల్లికి చెందిన కమలమ్మ అనే వృద్ధురాలు జీబీఎస్‌తో గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. 13 రోజుల పాటు చికిత్స పొందిన బాధితురాలు.. పరిస్థితి విషమించడంతో కన్నుమూసింది. మరో బాధితురాలు ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు జీబీఎస్ లక్షణాలతో శ్రీకాకుళం జిల్లా గోదాయవలసకు చెందిన యువంత్ అనే బాలుడు.. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఆ గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి..అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే జీబీఎస్ అంటు వ్యాధి కాదని..ఇన్ఫెక్షన్ల బారినపడకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని సూచిస్తున్నారు. అరుదుగా లక్షమందిలో ఒకరిద్దరికే వచ్చే జీబీఎస్ అనే నరాల సంబంధిత వ్యాధి కేసులు ఏపీలో ఇటీవల ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గుంటూరు ప్రభుత్వాసుపత్రికి ఈ నెల 11న ఒక్కరోజే ఏడు కేసులు వచ్చాయి. వారిలో ఇద్దరు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఇదే వ్యాధితో కాకినాడలో ఇటీవల ఇద్దరు చేరారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఈ వ్యాధితో 17 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఒక్కసారిగా జీబీఎస్ కేసులు పెరగడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. జీబీఎస్ కేసులపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు..ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్‌గా ఉండాలని సూచించారు. ఏపీ వ్యాప్తంగా గత ఏడాది...
