17 February 2025
Subhash
భారత్‌లో ప్రస్తుత సీజన్‌లో చక్కెర ఉత్పత్తి భారీ తగ్గింది. మొత్తం ఉత్పత్తి 27 మిలియన్ మెట్రిక్ టన్నుల కంటే తక్కువగా. గతేడాది 31.8 మిలియన్ మెట్రిక్ టన్నుల కంటే తగ్గింది.
ఫిబ్రవరి 15నాటికి చక్కెర ఉత్పత్తి 19.77 ఎంఎంటీ.గత సీజన్ కంటే 12శాతం తక్కువ. చక్కెర ఉత్పత్తి తగ్గుదలకు ప్రధాన కారణం ఇథనాల్ ఉత్పత్తికి ఎక్కువగా చెరకును ఉపయోగించడం.
మహారాష్ట్రలో భారీగా ఉత్పత్తి తగ్గింది. ఏకంగా 14శాతం ఉత్పత్తి పడిపోయింది. కర్ణాటకలో 13శాతం, ఉత్తరప్రదేశ్‌లో 8శాతం తగ్గుదల నమోదైంది. దీంతో చక్కర ధరలు పెరిగే అవకాశం ఉంది.
గతపక్షం రోజుల్లో కర్ణాటకలో చెరకు లభ్యత 22శాతం తగ్గింది. మహారాష్ట్రలో చెరకు లభ్యత గతేడాదితో పోలిస్తే 7.8 శాతం తగ్గింది. ప్రస్తుత సీజన్‌లో యూపీలో చెరకు లభ్యత 1.4 శాతం పెరుగుదలతో ఉంది.
ఫిబ్రవరి 15నాటికి దేశంలో చక్కెర ఉత్పత్తి 19.77 ఎంఎంటీ కాగా, గత సీజన్ ఇదే సమయానికి కంటే 12శాతం తక్కువ. చక్కెర ఉత్పత్తి తగ్గుదలకు ప్రధాన కారణం ఇథనాల్ ఉత్పత్తికి ఎక్కువగా చెరకును ఉపయోగించడం.
సీజన్‌లో చెరకు క్రషింగ్ 4.5శాతం తగ్గి 218 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకుంది. గత సీజన్‌లో 228 ఎంఎంటీలుగా ఉంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బియ్యం ధరల పెంపును ఉపసంహరించుకుంది.
ఉత్పత్తి తగ్గినప్పటికీ చక్కెర ధరలు స్థిరంగా, లాభదాయకంగా ఉన్నాయి. యూపీలో చక్కెర ధరలు టన్నుకు రూ.41వేలు ఉండగా, మహారాష్ట్రలో టన్నుకు రూ.37,500 కంటే ఎక్కువగా ఉంది.
ప్రభుత్వం ఇటీవల ఒక ఎంఎంటీ చక్కెర కోటా ఎగుమతికి ఆమోదించిన నేపథ్యంలో వచ్చే ఏడాది దేశీయంగా ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.